కొండారెడ్డి బురుజు సాక్షిగా బాబు గల్లాపట్టి తుక్కు రేగ్గొట్టిన పవన్ ఇప్పుడు చచ్చిన పాములా..

అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు నట్టేట్లో ముంచేసాడే గంగరాజు.. 2014 ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు చేసిన ఘనకార్యం ఈ పాట మాదిరిగానే ఉంది. సీఎం చంద్రబాబు రైతులకు, డ్వాక్రా మహిళలకు ఏం న్యాయం చేశారని.. ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని..2019 ఎన్నికలకు ముందు కొండారెడ్డి బురుజు దగ్గర ఏర్పాటు చేసిన సభలో పవన్‌ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించలేదా..? అధికార పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే సిగ్గేస్తోందని 2019 ఎన్నికల ప్రచారంలో స్వయంగా పవన్ కళ్యాణే బాబుని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన అనంతరం బాబు ఇచ్చిన 600 హామీలలో కనీసం పట్టుమని పది హామీలైనా నెరవేర్చావా బాబు. అదన్నాడు.. ఇదన్నాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల చేతికి చిప్ప ఇచ్చి.. ఆయన కుమారుడికి పోస్ట్ ఇచ్చారు. ఈ మాట మేమంటున్నది కాదు.. బయట జనం కోడై కూస్తున్నారు. చంద్రబాబు ఫేజ్ – 1 మేనిఫెస్టో పై ప్రజలు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. మహిళలకి పది వేలు ఇస్తా అన్నాడు, ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తా అన్నాడు. 2019 ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఇవి. మరి బాబుని జనం నమ్మారా అంటే.. నమ్మలేదు గనుకనే 2019 ఎన్నికల్లో మట్టి కరిపించింది అని చెప్పక తప్పదు. గుండు సార్ డైలాగ్ లా డబ్బులు ఊరికే రావు బాబు. 2014 లో అంటే.. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయం అది. అసలు ఉద్యోగుల జీతాలకి డబ్బులే లేవన్నాడు.. జీతం పెంచమని అడిగితే.. ఆశా వర్కర్లని కొట్టించిన మాట వాస్తవం కాదా చంద్రబాబు.

ఆశా వర్కర్లకు 3 వేల గౌరవ వేతనం ఇస్తామని, పనితీరును బట్టి మరో మూడు వేలు ఇచ్చే అవకాశం కల్పిస్తానని చెబుతూ అందరూ హ్యాపీయేనా? అని నాడు తమరే కదా బాబు అన్నది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడెక్కడో సంక్షేమ పథకాలను కాపీ కొట్టి.. ఏం తమ్ముళ్ళు అదిరిపోలా అంటావా..అందుకే కదా ప్రభుత్వ ఉద్యోగులందరూ 2019 ఎన్నకల్లో తమరికి అదరగొట్టారు. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే.. బాబు చేసిన తప్పుడు హామీలు, నాలుక మాడతేసే మాటాలు కోకొల్లలు ఉన్నాయి. మొత్తానికి మోసగాడు మళ్ళీ వచ్చాడన్నమాట అని.. పబ్లిక్ నవ్వుకొని.. తమ మేనిఫెస్టోని దేకను కూడా దేకట్లేదు