పవన్ దెబ్బకి టీడీపీ కంచుకోట భూస్థాపితం వైసీపీ సూపర్ సక్సెస్

పొత్తుల విషయం దేవుడెరుగు.. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో పవన్ నుంచి ఇంకా క్లారిటీ కూడా రాలేదు. అయితే..
పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గాలలో భీమవరం కూడా ఒకటి. కానీ.. ఆయన వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌పై పరాజయం పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం నుంచే బరిలో దిగుతారా? లేదా? అన్న చర్చలు నడుస్తున్నాయి. పొత్తులు కుదిరితే టిడిపి కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తారా..? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు వస్తున్నాయి. అయితే.. భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ తర్వాత టిడిపికి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు.. 16 సార్లు ఎన్నికలు జరిగితే.. 6 సార్లు టీడీపీ అభ్యర్థులే గెలిచారు. ఈ సెగ్మెంట్‌లో కాపు సామాజికవర్గం ఓటర్లే అధికంగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కదా.. గత ఎన్నికల్లో ఆయన ఎందుకు ఎమ్మెల్యేగా గెలవలేదు అంటే.. చివరికి పవన్ దగ్గర కూడా సమాధానం లేదు. అయితే గత ఎన్నికల్లో పొత్తులు లేకపోవడం వల్ల ఓట్లు చీలి.. వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ విజయం సాధించారు. మరోసారి గెలుపు తనదేననే గ్రంథి శ్రీనివాస్‌ ధీమాలో ఉన్నారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే.. తనని గెలిపిస్తాయంటున్నారు. భీమవరంలో వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పుకుంటున్నారు. అధినేత జగన్ ఆదేశిస్తే.. మరోసారి పోటీకి సై అంటున్నారు గ్రంథి శ్రీనివాస్‌.

ఇక.. భీమవరంలో తెలుగుదేశం పరిస్థితి అయోమయంగా మారింది. ఒకప్పుడు.. టీడీపీకి ఎదురులేని సీటుగా ఉన్న ఈ సెగ్మెంట్.. ఇప్పుడు సరైన నాయకత్వం లేక.. వెనుకబడిపోతోంది. ఒకవేళ పొత్తులు ఉంటే ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్ళడం ఖాయం. సో.. అలాంటప్పుడు పార్టీ కోసం కష్టపడితే తమకి ఎలాంటి లాభం లేదని అక్కడి నేతలు ఆలోచిస్తున్నారట. అయితే.. పవన్ కళ్యాణ్ కూడా భీమవరంలో పెద్దగా పర్యటించిన సందర్బాలు లేవు. భీమవరంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని.. ఇక్కడి ప్రజల్లో సెంటిమెంట్ ఉంది. గతంలో వైసీపీ ఇలానే సూపర్ సక్సెస్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో అదే వేవ్ కంటిన్యూ చేయాలని వైసీపీ కృషి చేస్తోంది. వైసీపీ అభ్యర్థికి మళ్లీ చాన్స్ ఇస్తారా? లేక.. జనసేన వైపు చూస్తారా? అనేదే చూడాలి.