సీఎంలందరి కంటే ధనిక సీఎం జగన్ అని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఏపీ లో ప్రజలంతా పేదలుగా ఉంటే ముఖ్యమంత్రి మాత్రం దేశంలో అత్యంత ధనికుడైన సీఎంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా వైసీపీ రాజ్యానికి బానిసలుగా తయారయ్యారని అన్నారు. భూమి నుండి ఇసుక వరకు మద్యం నుండి గనుల వరకు అడవుల నుండి కొండల వరకు కాగితం నుండి ఎర్రచందనం వరకు రాష్ట్రం నుండి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రికే. నిజంగా క్లాసిక్! ” అని పవన్ ట్వీట్ చేశారు. ‘వైసీపీ ఏపీలోని పేదలను సామాన్యంగా ఉండేలా సంతృప్తి పరిచిందని, వారి జీవితాలు పరువు శ్రమ కొన్ని వందల డబ్బులకు అమ్ముడయ్యాయని అన్నారు. మధ్యతరగతి వారు అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. కేవలం మధ్యతరగతివారు పన్ను కట్టేవారిగా మాత్రమే పరిగణించబడుతున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు.
”అరకులో బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తూ భారతదేశంలో అక్రమాస్తుల ఆరోపణలతో అత్యంత ధనవంతుడు అయిన సీఎం జగన్… కామ్రేడ్ చారు మజుందార్ కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి మరియు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వంటి ‘క్లాస్ వార్’ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. వాట్ ఏ ఐరనీ!!” అని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.”వైసీపీ ఆంధ్రాకి పెట్టుబడుల గలాక్సీ తీసుకురాగలిగినప్పుడు దావోస్ ఎవరికి కావాలి? మన ఐటీ పరిశ్రమల మంత్రి ఇప్పటికే నూడుల్స్ సెంటర్ చాయ్ పాయింట్లను ప్రారంభించారు ఇప్పుడు ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం మాత్రమే వేచి ఉన్నారు” అంటూ గుడివాడ అమర్ నాథ్ ను తన ట్వీట్లతో పవన్ ఏకిపారేశారు.