పోలవరం… జగన్ దక్షతకు నిదర్శనం రాజన్న కొడుకొచ్చాడు..ఇప్పటి నుండి ఒక లెక్క..

ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క.. రాజన్న కొడుకొచ్చాడు.. ప్రతి అవకాశంలోనూ తన వక్తిగత ప్రయోజనం వెతుక్కుని.. ప్రతి అవకాశాన్ని సమాజ హితం కోసం కాకుండా తన అనుయానులకు ప్రయోజనకరంగా ఉండేలా పోలవరం ప్రాజెక్ట్ ను వాడుకున్నారు చంద్రబాబు.
జగన్ వచ్చాక దాని తీరుతెన్నులు మారాయనే చెప్పాలి. జగన్ దక్షతకు నిదర్శనమనే చెప్పడంలో అతిశయోక్తి లేదు. నాడు 2014లో ఆంధ్ర రాష్ట్ర చిరకాల స్వప్నం అయిన పోలవరం ప్రాజెక్ట్ కు వైఎస్ ఆర్ శ్రీకారం చుట్టారు. మహానేత అనంతరం పాలకుల నిర్లక్ష్యం కారణం, అంచనా వ్యయం పెంచేసి దోపిడీ కారణంగా ప్రాజెక్ట్ ఫలాలు ప్రజలకు అందించలేదు. తెలుగు ప్రజల ఆశలతో చంద్రబాబు నయా గ్యాంగ్ దోబుచులాడుకున్నది.
పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్ర రాష్ట్రంలో 27 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందేది. కానీ ఈ అవకాశాల చంద్రబాబు ఎం చేశారంటే..
పట్టిసీమ ఎత్తి పోతల పథకానికి చంద్రబాబు రూపకల్పన చేసి తూట్లు పొడిచాడు. పోలవరాన్ని వదిలేసి కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరేలా పట్టి సీమను పూర్తి చేయడానికి బాబు ఆసక్తి చూపించారు.పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి 1299 కోట్లు ఖర్చయ్యింది. పోలవరాన్ని పూర్తి చేద్దాం అనే ఆలోచన చంద్రబాబుకు లేదు.. అందుకే నాడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఐన చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు నటించాడు. పట్టిసీమ మూలంగా 70 టీఎంసీ ల నీరు కృష్ణ జిల్లాకు వెళ్తుంది. అయినప్పటికీ రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. అదే.. పోలవరం పూర్తి అయితే 80 టీఎంసీల నీరు వెళ్ళేది. మెట్ట ప్రాంతాలలో పంటలు పుష్కలంగా పండేవి. 2013-14 ధరల ప్రకారం ఐతే రావాల్సింది 1249 కోట్లే. కానీ
సీఎం జగన్ సమర్థతతో కేంద్రం నుంచి 12,911 కోట్లు సాధించారు. ఇలా కేంద్రం సహకారం మెండుగా ఉంటే.. మరో ఏడాదిలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.