1.వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి..
చంద్రబాబును నిలదీసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
2. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆర్.కృష్ణయ్య భేటీ..
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి.
3.ఏజెన్సీలో పూర్తిస్థాయి వైద్యసౌకర్యాలు.. వైద్యసిబ్బంది, మందుల లభ్యతకు చర్యలు..
అదికారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆదేశాలు.
4.నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపు..
బీజేపీ నేత సత్యకుమార్పై దాడికి నిరసనలు.
5.ఏపీలో ఘనంగా ఆసరా పంపిణీ కార్యక్రమాలు..
సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ కృతజ్ఞత తెలిపిన మహిళలు.
6.గన్నవరం వైసీపీ నేతలు యార్లగడ్డ, దుట్టాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ..
2018లో వారిపై నమోదైన కేసుకు సంబంధించి నూజివీడు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్డి ఈ మేరకు ఆదేశాలు.
7.’ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంపై చంద్రబాబు సమీక్ష
ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేయాలని పార్టీ నాయకులకు ఆదేశం.
8.జగన్ ప్రేరేపించడం వల్లే సత్యకుమార్ పై దాడి జరిగిందంటూ ప్రధానికి రఘురామ లేఖ
దాడి విషయం తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ.
9.అమరావతికి మద్ధతిస్తే దాడి చేస్తారా.. వైసీపీ దాదాగిరీకి ఇది పరాకాష్ట..
సత్యకుమార్పై దాడి ఘటనపై పవన్ రియాక్షన్.
10.జగన్ మాదిరిగానే వైసీపీ కౌన్సిలర్లు కూడా ఫ్రస్టేషన్లో ఉన్నారు…
దీనికి నిదర్శనమే తెనాలి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో వైశ్యుడైన టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ పై దాడి అంటూ లోకేష్ ట్వీట్