వైఎస్ జగన్ బొమ్మపై గెలిచి.. అదే పార్టీపై తిరుగుబాటు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రతిరోజూ రచ్చబండ కార్యక్రమంతో ఏపీ ప్రభుత్వంపై ఏదో ఒక ఆరోపణలు చేయడం ఆయన నైజ౦. ఇక ఈ క్రమంలోనే రఘురామ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణ కోసం గవర్నర్‌ను జగన్ కలిశారని.. మంత్రివర్గంలో మాజీ మంత్రి నాని లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అందుకే ఆయన్ని తిరిగి కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారన్నారని రఘురామ పేర్కొన్నారు. అయితే.. కొడాలి నానికి మరోమారు మంత్రిపదవి అంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశాన్ని స్వయంగా రఘురామ నోట చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా.. ఏపీలో ముందస్తు ఎన్నికలపై కూడా రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా సిఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో కూడా ఆయన వివరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే ఏపీలో కూడా ముందస్తు ఎన్నికల నిర్వహణకి సహకరించాలని ప్రధాని మోదీని కొరడానికే.. సిఎం జగన్ ధిలీ వెళ్లారని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. జగన్ ఢిల్లీ టూర్ ప్రత్యేక హోదా సాధన కోసం, పోలవరం పెండింగ్ బిల్లుల కోసమేనని పైకి చెబుతున్నా.. వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తోందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోన్న సమయంలో.. గవర్నర్‌ను కలిసిన వెంటనే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లభించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.