ఏపీ నెంబర్ వన్ అని కేంద్రం వెల్లడి అమిత్ షా, నడ్డాలను కొడతారన్న రఘురామ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

1.’లోకేశ్ యువగళం, పవన్ వారాహిని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు’..
బీజేపీ నేతలు టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మంత్రి మేరుగు నాగార్జున విమర్శ.

2.అమిత్ షా సభా వేదికపై ఉన్నవారంతా టీడీపీ నేతలే..
వారంతా పసుపు కండువా తీసి కాషాయ కండువా వేసుకున్న నేతలే అని సుబ్బారెడ్డి ఫైర్.

3.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశావ్ చంద్రబాబు..
పక్కరాష్ట్రం నుంచి మేనిఫెస్టో తీసుకొచ్చి.. బిసిబిల్లా బాత్ వండుతున్నారని క్రోసూరు సభలో సిఎం జగన్ సెటైర్లు.

4.కాపు ఉద్యమకారుడు కుటుంబానికి బాసటగా నిలిచిన సిఎం జగన్..
2016లో కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు పాల్పడిన చీకట్ల వెంకట రమణమూర్తి కుమార్తెకు 5 లక్షల చెక్కు అందజేసిన కన్నబాబు.

5.ఉద్దానం చెంతకు ఆధునిక వైద్యం..
60 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. తుది దశకు చేరిన పనులు.

6.అన్నింట్లో ఏపీ నెంబర్ వన్ అని కేంద్రం చెబుతుంటే, అవినీతి అంటూ అమిత్ షా వ్యాఖ్యానిస్తారా?..
అమిత్ షా ఎవరో చెప్పిన మాటలు పలికారన్న మంత్రి కారుమూరి..

7.జగన్‌ అక్రమాస్తుల కేసులను తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో హరిరామ జోగయ్య పిల్..
జోగయ్యపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.. ప్రచార ప్రయోజనాల కోసం పిల్‌ వేశారా? అంటూ ప్రశ్న.

8.నన్ను కొట్టినట్టు అమిత్ షా, నడ్డాలను కూడా కొడతారా?..
జగన్ కు రఘురామకృష్ణరాజు ప్రశ్న.

9.ఏపీని ఆలీబాబా 40 దొంగలు దోచేస్తున్నారు..
ప్రభుత్వ వ్యవస్థలో జరిగే దోపిడీని ప్రశ్నించినందుకే పార్టీ నుంచి పంపేశారని ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్య.

10.రాజకీయాల్లోకి సప్తగిరి..
టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటన!