పవన్ ను కరివేపాకులా తీసేసిన మోడీ సీఎం జగన్ కు ఊహించని క్రేజ్ రఘురామకు ఘోర అవమానం

ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా…బుల్లెట్ దిగిందా..? లేదా..? అనేది ముఖ్యం అంటాడు ఓ సినిమాలో హీరో. వైఎస్ జగన్ కూడా అదే పందాలో నడుస్తూ.. దేశ రాజకీయాలలో తమ సత్తా చాటుతున్నారు. వైఎస్ జగన్ ది వారసత్వ రాజకీయమే అయినా ఆయన వ్యూహమే వేరు.. ఆయన రాజాకీయమే వేరని చెప్పాలి. ఎందుకంటే.. సొంతగా పార్టీ పెట్టి.. ఒక్కడిగా ఎదిగి.. నేడు దేశ రాజకీయ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు అంటేనే అర్ధంఅవుతుంది.. ఆయన డెడికేషన్ ఎలా ఉంది అనేది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే..కొత్తగా ప్రారంభించిన పార్లమెంటు భవన వేడుకలకు దేశవ్యాప్తంగా బీజేపీ అనుకూల పార్టీలను పిలవలేదు. కేవలం ముఖ్యమంత్రులను మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇక ఎంపీలను పిలిచినా.. కేవలం మోడీ ప్రసంగాన్ని వినేందుకు మాత్రమే వారిని పరిమితం చేశారు. ఇక ఇదే కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా హాజరయ్యారు. కానీ.. ఈ కార్యక్రమానికి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనకు ఆహ్వానం అందలేదు. తాము ఎన్డీయే కూటమిలో ఉన్నా..పిలుపు అందలేదని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానించారు. ఎలా అందుతుంది. అసలు జనసేనకు ఎం అర్హత ఉందని.. ఆహ్వానం అందుతుందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జగన్ ఏదో మోడీ అడుగుజాడల్లో ఉంటున్నారని విమర్శలు చేస్తున్నారు. చివరికి మోడీ దత్తపుత్రుడు జగన్ అని కొందరు టిడిపి , జనసేన నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. తాము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోము, ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్ళమని .. వైజాగ్ లో జరిగిన సభలో, స్వయంగా మోడీ ఎదురుగానే జగన్ ధైర్యంగా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు.. తాము బీజేపీతో కలిసే ఉన్నామని. మరి మోడీకి, చంద్రబాబుకి దత్తపుత్రుడు ఎవరో ప్రజలందరికీ తెలిసిందే. జగన్ ఒక హోదాలో ఉండి.. ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. మరి జనసేనకి, పవన్ కళ్యాణ్ కి ఎలాంటి అర్హత ఉందని తనకి ఆహ్వానం ఉంటుందని ఎందుకు అనుకున్నారు అంటూ.. కొందరు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కొత్త పార్లమెంటు భవనంలో జగన్ ను చూసి, ఆయన హుందాతనాన్ని చూసి రఘురామ మొహం చిన్నబోయిందనే చెప్పాలి. ఎందుకంటే.. జగన్ కి ఆ హూందాతనం ఆయనకున్న రాజకీయ పదవి నుంచి వచ్చిందే. వైసీపీ బొమ్మపై గెలిచిన వ్యక్తి.. అదే పదవి అధికారంతో ఈ కార్యక్రమానికి రఘురామ ఎందుకు వచ్చారు అంటూ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.. వైసీపీ ఎంపీగా నూతన పార్లమెంటు భవన వేడుకలకు రాకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.