మహానటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలను చంద్రబాబు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అలా చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ..అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫోటోకి ఒక్క దండ కూడా వేయని చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డాయని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారా..? అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని భారతరత్న అవార్డు ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? నాడు మోడీతో రాసుకుపూసుకు తిరిగిన బాబు అప్పుడే ఎందుకు ఇప్పించలేదు…? ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం ఎన్టీఆర్ గుర్తుకు వచ్చారా..? తారకరామారావు శతజయంతి వేడుకలలకు ఎక్కడో ఉన్న నటుడు రజినీకాంత్ ను ఆహ్వానించారు కానీ.. నందమూరి వారసుడు అయిన తారక్ ను ఆహ్వానించారా..? సరిగ్గా ఇదే ప్రశ్న రజినీకాంత్ కూడా లేవనెత్తారని టీడీపీ పార్టీ వర్గాల్లోనే చర్చలు నడుస్తున్నాయి. శత జయంతి ఉత్సవాలకి తారక్ ని పిలిచారా లేదా ? అని రజనీకాంత్ బాలకృష్ణని అడిగారట..మరి దానికి వారు ఏమని సమాధానం చెప్పాలో తెలియక నోరు ఎల్లపెట్టారట. చంద్రబాబును పొగిడించుకునేందుకు ఎక్కడో ఉన్న రజినీకాంత్ ని పిలిపించుకున్నారని రాష్ట్ర ప్రజలు తమ అభిప్రాయ వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను దారుణంగా వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని ఎలా పొగడాలనిపించింది అంటూ రజనీకాంత్ ను ప్రశ్నించారు. రజనీకాంతు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదు, రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందని . ఎన్టీఆర్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం.. ఎన్టీఆర్, వైఎస్సాఆర్ అని రజనీకాంత్ తెలుసుకోవాలని అంటున్నారు. ఎన్టీఆర్ను అసెంబ్లీలో ఎలా అవమానించారో కూడా తెలుసుకోవాలని చెప్తున్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇప్పిస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. నందమూరి వారసులలో ఒక్క బాలకృష్ణ తప్పితే.. మిగతా వారికి ఎందుకు ఆహ్వానాలు పంపలేదని ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.