పచ్చ మీడియాకి స్ట్రోకు మీద స్ట్రోకు రామోజీకి చెల్లు చీటి..!

వై.ఎస్.జగన్ అనే నేను.. ఈ మాట విని సరిగ్గా నాలుగేళ్ళు అయ్యింది. అదే వైఎస్ జగన్ సిఎం గా ప్రమాణస్వీకారం చేసిన రోజు ఇది. ఆయన అధికార పీఠాన్ని చేజిక్కించికున్న నాటి నుండి.. ఇచ్చిన మాటకు కట్టుబడి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి దేశంలో మరే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన పాలనకు రాష్ట్ర ప్రజలు జేజేలు పలుకుతున్నారు అంటేనే అర్ధం అవుతుంది.. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అనేది. అంతెందుకు సంక్షేమంతో రాష్ట్రం మరో శ్రీలంకలా మారిపోతుంది అన్న చంద్రబాబే.. ఆఖరికి ఆయన ప్రవేశపెట్టిన ఫేజ్- 1 మేనిఫెస్టోలో అన్ని కూడా సంక్షేమ పథకాలే ఉన్నాయి. ఇక్కడ అసలు విషయానికొస్తే.. వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో దాదాపు 98 శాతం హామీలను నెరవేర్చారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను వందకు వంద శాతం అమలు చేయాలనే లక్ష్యంగా సిఎం జగన్ కృషి చేస్తున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో కొన్ని లక్షల మంది పెట్టుబడులు పెట్టి అన్యాయంగా మోస పోయారు. రామోజీరావు చేతిలో మోసపోయిన లక్షల మంది ప్రజలకు తాను అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. సిఎం జగన ఇచ్చిన మాటకు కట్టుబడి.. రామోజీ చేసిన అవినీతిని కక్కించే పనిలో ఉన్నారు. మార్గదర్శి పేరుతో వెలకోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించి అడ్డగోలుగా తమ సంస్థలలోకి మళ్లించి.. అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించి పెద్దమనిషిగా చెలామణి అవుతున్నారు. దశాబ్దాల కాలంగా సాగిన అతని అవినీతి బాగోతం ఇప్పుడు పక్కా ఆధారాలతో సహా బయటపడింది. రంగంలోకి దిగిన సీఐడీ తమ దర్యాప్తులో మరింత వేగం పెంచింది. మార్గదర్శి చిట్ ఫండ్స్కు చెందిన 793 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఐడీని అనుమతించింది.చిట్టీలు వేసిన చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్ ఫండ్స్ చెల్లించే స్థితిలో లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర డిపాజిట్రుల హక్కుల పరిరక్షణ చట్టం 1999 ప్రకారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.న్యాయస్థానం అనుమతితో చరాస్తుల జప్తునకు సీఐడీ అధికారులు చర్యలు చేపట్టనున్నా రు. చందాదారులకు మార్గదర్శి చిట్ ఫండ్స్ సకాలంలో చిట్టీల మొత్తాన్ని చెల్లించకపోవడంతో చందాదారులు పెద్ద సంఖ్యలో చిట్స్ రిజిస్ట్రార్, సీఐడీకి ఫిర్యాదు చేస్తున్నారు. వీటిని పరిశీలించిన సీఐడీ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది.