1.జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్..
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం, చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని నమ్ముతున్నా.. ఒక మేనమామగా అందిస్తున్నామని సీఎం ట్వీట్
2.లోతుగా విచారిస్తే బాబుల స్కాం బయటపడుతుంది..
చంద్రబాబు నైపుణ్యతకు స్కిల్ స్కాం ఓ ఉదాహరణ అని అమర్నాథ్ విమర్శ.
3.2019 నుండి ఎక్కడా గెలవకపోవడంతో టీడీపీ నాయకులు పిచ్చెక్కిపోయారు…
టీడీపీ గెలిచిన ఆ మూడు ఎమ్మెల్సీలు సొంత ఓట్లు, సింబల్తో గెలవలేదని మంత్రి రోజా సెటైర్
4.అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేలపై దాడి వ్యవహారంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి.
స్పీకర్ పట్ల టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరించారని మంత్రి మెరుగా నాగార్జున ఫైర్.
5.తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు..
‘ఉగాది’ పండుగ తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ అంటూ ట్వీట్.
6.ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని కేంద్రం స్పష్టం.
7.జగన్ ది కిల్ డెవలప్ మెంట్ పాలసీ..
రాష్ట్రంలో షెల్ కంపెనీలకు జగనే ఆద్యుడన్న ధూళిపాళ్ల నరేంద్ర.
8.దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీకి రూ.33 లక్షల విరాళం ఇచ్చిన లోకేశ్, బ్రాహ్మణి..
ఈ విరాళంతో నేడు టీటీడీ అన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ.
9. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క జల ప్రాజెక్టునైనా పూర్తి చేశావా..
చిత్తూరు జిల్లాకు తాగు, సాగునీరు అందించిన ఘనత చంద్రబాబుదేనని నారా లోకేష్ వ్యాఖ్య.
10.పీఏసీ లో ఏడు ఖాళీలను భర్తీ చేయాలి..
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఖాళీలపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ.