చల్లా కుటుంబంలో విభేదాలు సంచలన నిజాలు వెలుగులోకి

దివంగత వైసీపీ నేత చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. చల్లా రామకృష్ణా రెడ్డి కుమారుడు, వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కూడా నాలుగు నెలల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభావితమైన రాజకీయ కుటుంబాల్లో ఒకటిగా ఉన్న చల్లా ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు వీధిన పడ్డాయి. ఆ కుటుంబంలో వారసత్వ సమస్యలు వచ్చాయి. ఆ కుటుంబంలో వారసత్వ సమస్యలు వచ్చాయి. చల్లా రామకృష్ణారెడ్డి పెద్దకొడుకు విఘ్నేశ్వర్‌రెడ్డి పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తారంటూ కుటుంబీకులు ప్రకటించడంతో అసలు గొడవ మొదలైంది. ఆల్రెడీ జెడ్పీటీసీగా ఉన్న దివంగత భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మి పోటీకి రావడంతో ఇద్దరి మధ్య కోల్డ్‌ వార్‌ స్టార్ట్‌ అయ్యింది. శ్రీలక్ష్మి సెపరేట్‌గా ఆఫీస్‌ ఓపెన్‌ చేయడం, రాజకీయంగా తిరగడంపై చల్లా కుటుంబం గుర్రుగా ఉంది. అదిప్పుడు ఇలా రోడ్డుకెక్కింది.అయితే, ఫొటో పేరుతో తనపై చల్లా విఘ్నేశ్వర్‌రెడ్డి, మేనల్లుడు రవీంద్రారెడ్డి, ఆడపడుచు కలిసి దాడి చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు శ్రీలక్ష్మి. పోలీసులకు కంప్లైంట్‌ చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఊరిలో ఉండొద్దని, ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని వాపోతున్నారు ఆమె.చల్లా రామకృష్ణారెడ్డి ఫొటో కోసం ఒకరిపై మరొకరు పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్స్‌ చేసుకున్నారు శ్రీలక్ష్మి అండ్‌ విఘ్నేశ్వర్‌రెడ్డి. అయితే, రాజకీయ వారసత్వం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారంటున్నారు చల్లా పెద్దకుమారుడు విఘ్నేశ్వర్‌రెడ్డి. అంతేకాదు, తమ కుటుంబ ఆస్తులన్నీ శ్రీలక్ష్మి తనపై పేరును రాయించుకుందంటూ కీలక ఆరోపణలు చేశారు.

విఘ్నేశ్వర్‌ రెడ్డి తల్లి శ్రీదేవి, చెల్లెళ్లు బృంద, పృథ్వీ కలిసి శ్రీలక్ష్మి కార్యాలయంలో ప్రెస్‌ మీట్‌ పెట్టారు. ఇంట్లో ఉన్న శ్రీలక్ష్మి ఈ విషయం తెలుసుకుని తన కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టడం ఏమిటని లోనికి వచ్చి విఘ్నేశ్వర్‌ రెడ్డిపై ఓ టీవీ చానల్ లోగోను విసిరారు. దీంతో చల్లా కుటుంబంలోని ఇరు వర్గాల మహిళలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో రామకృష్ణారెడ్డి అక్క కుమారుడు రవీంద్రనాఽథ్‌ రెడ్డి కాలితో తన్నినట్లు శ్రీలక్ష్మి ఆరోపించారు. అనంతరం శ్రీలక్ష్మి వర్గానికి చెందిన సాయిచరణ్‌ రెడ్డి, చైతన్య రెడ్డి శ్రీలక్ష్మి కార్యాలయం వద్దకు రాగా మరోసారి ఇరువర్గాల వారు బాహాబాహీకి దిగారు. విఘ్నేశ్వర్‌ రెడ్డి, శ్రీలక్ష్మి వర్గాలపై కేసులు నమోదు చేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా బనగానపల్లె నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న చల్లా ఫ్యామిలీ ఇలా రోడ్డెక్కి ఘర్షణ పడటం రాజకీయాల్లో కలకలం రేపుతోంది.