మార్గదర్శి కేసులో పచ్చమీడియాకి షాక్ నిజం ఒప్పుకున్న శైలజా కిరణ్..!

మార్గదర్శి కేసు విషయంలో సీఐడీ దూకుడు పెంచుకుంటూ పోతుంది. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు దర్యాప్తు ఊపందుకుంది. ఇటీవలే ఆ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేసిన అధికారులు.. తాజాగా ఆయన కోడలు మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ను విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెల్లడైనట్లు సమాచారం. నిధులు మళ్లించాం.. కానీ ఎక్కడికో తెలియదని శైలజా కిరణ్ సీఐడీ విచారణలో తెలిపినట్లుగా సమాచారం. మరి స్వయంగా ఆమెనే నిజం ఒప్పుకున్నారు.. కదా.. కానీ పచ్చ మీడియాకి ఇది ఎందుకు కనపడదు అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే నిన్నటి విచారణలో.. శైలజా కిరణ్ సీఐడీ విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. తనకు ఆరోగ్యం బాగా లేదని, విదేశాల నుంచి రావడంతో జ్వరం వచ్చిందంటూ శైలజా కిరణ్ విచారణకు సహకరించకుండా చాలాసేపు జాప్యం చేశారు. విచారణ మొదలైన కొద్దిసేపటికే జ్వరంగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయంటూ వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్ కొన్ని మాత్రలు సూచించి విచారణ కొనసాగించవచ్చని చెప్పారు.
సీఐడీ అధికారులు మళ్లీ విచారణ చేపట్టిన కొద్దిసేపటికే మరోసారి తనకు ఆరోగ్యం సహకరించడం లేదని శైలజా కిరణ్ పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే పచ్చ మీడియా ఒక కథనం ప్రచురించింది. మార్గదర్శి సంస్థను అప్రతిష్టపాలు చేయాలన్న దుర్బుద్ధితో.. తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి సీఐడీ వేధిస్తోందని కథనం ప్రచురించింది. దీనిపై ఏపీ సీఐడీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ రియాక్ట్ అయ్యారు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం సీఐడీకి లేదని, విచారణపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఈనాడు, ఈటీవీ చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవం. ఆ ఆరోపణలను ఖండిస్తున్నాం. విచారణకు మార్గదర్శి యాజమాన్యం సరిగా స్పందించడం లేదన్నారు.. ఎస్పీ రవికుమార్. అసలు ఈ నిధులను ఎక్కడికి మళ్లించారో శైలజా కిరణ్ కు తెలుసని, కానీ ఆమె నిజానిజాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని నిపుణులు తమ అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.