షర్మిల, విజయమ్మను కూడా చం** నూజివీడు సభలో చంద్రబాబు ఆరోపణలు మండిపడ్డ లోకేష్.

1.కేంద్రం తీరుపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆగ్రహం..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై 24 గంటల్లో మాట మార్చిన కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా సింహాచలం వరకు పాదయాత్ర.

2.ఆరోగ్య రంగంలో ఏపీకి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు..
ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ఐడీలను జారీ చేయడంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.

3.మే నెల రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు..
నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేట నిషేధం..

4.ఉత్తరాంధ్రకు వెలుగు రేఖ..
శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణంతో మారనున్న ముఖచిత్రం.

5.చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశ్రుతి..
9 మంది మహిళలకు విద్యుత్ షాక్.

6.జగన్ అనే సైతాను ఉన్నంత వరకు రాష్ట్రంలో అభివృద్ధి జరగదు..
ఒక్క అవకాశానికి నమ్మి మోసపోయి ప్రజలు బాధపడుతున్నారని నూజివీడు సభలో చంద్రబాబు ఆరోపణలు.

7.ఆగస్టు లేదా సెప్టెంబరులో ఏపీ అసెంబ్లీ రద్దు.. ఆపై ఎన్నికలు..
తెలంగాణతోపాటు ఏపీ ఎన్నికలు కూడా జరుగుతాయ౦టూ రఘురామరాజు జోస్యం.

8.జనసేన పార్టీలో నాగబాబుకు ప్రమోషన్…
పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన పవన్

9.జగన్ దళితులకు పీకింది, పొడిచింది ఏమి లేదు అని ఎస్సీల సమావేశంలో అంటే ఆ వీడియో ని ఫేక్ ఎడిట్ చేసి హడావిడి చేస్తున్నారు..
10 ఏళ్ల నుండి సాక్షిలో నాపై అనేక అసత్య వార్తలు రాస్తున్నారని మండిపడ్డ లోకేష్.

10.వచ్చే ఎన్నికల్లో సింపతీ కోసం షర్మిల, విజయమ్మను కూడా చంపొచ్చు..
మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తాడని డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు.