టీడీపీని ముంచిన రాబిన్‌ టీం

ప్రస్తుత రాజకీయాలలో సర్వేల హవా నడుస్తోంది. ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా.. ఎవర్ని ఎక్కడ నుండి పోటీ చేయించాలన్నా.. ప్రజయ క్షేత్రంలో తమకి ఎంతవరకు గ్రాఫ్ ఉంది.. ఇలా అన్ని రకాల సర్వేలు చేయించడం నేటి రాజకీయాలలో ఫ్యాషన్ అయిపోయింది. అయితే.. 2019 ఎన్నిక‌ల్లో
జ‌గ‌న్‌ను అధికారంలోకి తెచ్చేందుకు పీకే నానా ప్ర‌య‌త్నాలు చేశారు. పీకేను ఓపెన్‌గానే జ‌గ‌న్ మ‌న వ్యూహ‌క‌ర్త అంటూ ప్ర‌చారం చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఎన్న‌డూలేనిది టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా.. వ్యూహ‌క‌ర్త‌ల‌ను నియ‌మించుకునే సంప్ర‌దాయానికి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో పీకే టీంలో ప‌నిచేసిన రాబిన్ శ‌ర్మ‌ను ఆయ‌న తెచ్చుకున్నారు. నిజానికి చంద్రబాబు ఎన్నడూ కూడా ఇలాంటి విహకర్తలను నమ్మిణ దాఖలాలు లేవు. కానీ వైఎస్ జగన్ దెబ్బకి చంద్రబాబు కూడా రూటు మార్చి.. పూర్తిగా వ్యూహకర్తపై ఆధారపడిపోయారంటే అస్సలు నమ్మకం కలగదు. ఎవ‌రు కాద‌న్నా.. ఔన‌న్నా.. ప్ర‌స్తుతం వ్యూహ‌క‌ర్త‌లే కీల‌కంగా మారారు.రాబిన్‌శ‌ర్మ టీడీపీ వ్యూహ‌క‌ర్త‌గా వ‌చ్చి కూడా రెండేళ్లు దాటుతోంది. అయితే.. ఇన్నేళ్లలో పార్టీ అభివృద్ది కోసం ఆయన చేసింది ఏమీ లేదట. ప్రస్తుతం పార్టీలో అదే చర్చ నడుస్తోంది. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో అటు బ‌ల‌మైన అధికార ప‌క్షంతో పోటీ పడాల్సిన ప‌రిస్థితి. మ‌రి ఈ క్ర‌మంలో టీడీపీని రాబిన్ శ‌ర్మ ఏమేర‌కు బ‌లోపేతం చేశార‌నేది ప్ర‌శ్న‌. మరో వైపు లోకేష్ పాదయాత్ర కూడా అంతంత మాత్రంగానే సాగుతోందని.. పార్టీలో ఉన్న కొందరు నాయకులు అంటున్నారు. రాబిన్‌శ‌ర్మ వ్యూహాలన్నీ బెడిసికొట్టాయని ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నాయి. బాదుడే బాదుడు.. ఇదేం ఖ‌ర్మ ఈ రాష్ట్రానికి అనే రెండు కాన్సెప్టులకు అంతగా ఆదరణ దక్కలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేయాల్సిన కార్య‌క్ర‌మాల టైటిల్స్ విష‌యంలోనే ఫెయిట్ అయిన రాబిన్ శ‌ర్మ ఇక పార్టీని ఎలా అధికారంలోకి తెస్తాడన్న‌ది పార్టీ వ‌ర్గాల‌కే అంతు ప‌ట్ట‌డం లేదు. అసలు ఆయన టీం పార్టీ కోసం ఏ మాత్రం కష్టపడట్లేదని పార్టీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. అధికార పార్టీపై రాష్ట్రంలో అక్కడక్కడా వ్యతిరేకత ఉన్నప్పటికీ.. దానిని హైలెట్ చేయడంలోనూ రాబిన్ శర్మ ఫెయిల్ అయ్యారని తెలుస్తోంది. అసలే గతంలో చంద్రబాబుపై చాలావరకు ప్రజయ వ్యతిరేకత ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావాలంటే.. అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. అంతకు మించి.. తాము టీడీపీ గ్రాఫ్ ని పెంచుకోవడంలో కీలక పాత్ర వహించాలి. కానీ పార్టీలో ఇప్ప‌టికీ అసంతృప్తి అలానే ఉంది. అంతేకాదు.. వైసీపీ వ్యూహాల‌కు ప‌దునైన వ్యూహాలు వేసేలా.. పార్టీని స‌మ‌ర్థ‌వంతంగా నడిపించేలా రాబిన్ శ‌ర్మ చేసిన ప్ర‌యోగాలు.. ప్ర‌య‌త్నాలు కూడా క‌నిపించడం లేదు. మ‌రి దీనిని బ‌ట్టి రాబిన్ శ‌ర్మ‌తో టీడీపీకి ప్ల‌స్ క‌న్నా.. మైన‌స్సే ఎక్కువ‌గా ఉంద‌ని… చంద్ర‌బాబు క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి అంచ‌నా వేసుకుని ముందుకు వెళ్ల‌క‌పోతే డేంజ‌రే అన్న చ‌ర్చ‌లు పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి.