వివేకా కేసులో షాకిచ్చిన లేఖ..! స్కెచ్ అని తేలితే.. వారికి చిక్కులే

వివేకా కేసులో అవినాష్ రెడ్డి లేవనెత్తిన లెటర్ విషయంపై సీబీఐ కూపీ లాగుతోంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సంఘటనా స్థలంలో లభించిన లేఖ మరోసారి చర్చల్లోకొచ్చింది. అసలు ఆ లేఖను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది..?ఈ లేఖలో డ్రైవర్ ప్రసాద్ తన హత్యకు కారణమని, వదిలి పెట్టవద్దని చనిపోయేముందు రాసినట్టుగా ఉంది. ఆ లేఖను వివేకా చేత బలవంతంగా రాయించారా..? లేక వివేకానే స్వయంగా రాశారా..? అన్నదే ఇక్కడ ఉత్కంఠగా మారింది. ఈ హత్య జరిగి నాలుగేళ్ళు పూర్తయినప్పటికీ.. ఇప్పటి వరకు ఈ లేఖపై సీబీఐ పూర్తి దర్యాప్తు చేయకపోవడం వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా..? ఆ లేఖను దాచిపెట్టమని హత్య జరిగిన రోజున నర్రా రాజశేఖర్ రెడ్డి పీఏ కృష్ణారెడ్డికి ఎందుకు చెప్పారనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఆ లెటర్ ను సునీత భర్త రామ్ సింగ్ కి అప్పుడే ఇచ్చామని చెప్తున్నప్పటికీ.. రామ్ సింగ్ ఆ లెటర్ ను బయటకు రాకుండా ఎందుకు చేశారు అన్నదే ఎవ్వరికీ అర్ధం కాని ప్రశ్న. ఇప్పటికే ఈ లేఖను పరీక్షించిన సీఎఫ్ఎస్ఎల్ బలవంతంగా రాసినట్టుగా ధృవీకరించింది. ఈ క్రమంలో ఈ లేఖపై ఇంకెవరివైనా వేలి ముద్రలు ఉన్నాయో లేవో తెలుసుకోవడం కీలకంగా మారింది. అందుకే నిన్‌హైడ్రిన్ పరీక్షకు సిద్ధమైంది సీబీఐ. ఈ లేఖపై వేలిముద్రల గుర్తింపునకు నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై రేపు నాంపల్లి సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.ఈ లేఖను వివేకా చేత బలవంతంగా రాయించారని ఈ పరీక్షలో తేలితే కీసులో మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. సీబీఐ విచారణకు దస్తగిరి ఇప్పటికి రెండుసార్లు హాజరు కాలేదు. మరి ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్పడంలో సీబీఐ చూపించిన ఆతృత.. మరి దస్తగిరి తమ విచారణకు ఏకంగా రెండుసార్లు డుమ్మా కొట్టటంపై ఎందుకని రియాక్ట్ అవలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు సీబీఐని ప్రశ్నిస్తున్నారు. దస్తగిరి దర్జాగా బయట దాదాగిరి చేస్తుంటే సీబీఐ ఎం చేస్తోందని కూడా ప్రశ్నిస్తున్నారు.