వైఎస్ వివేకా హత్య ఆస్తుల కోసం జరిగిందా..?లేక రాజకీయ కోణంలో జరిగిందా..? ఈ కేసులో సీబీఐ బలమైన ఆధారాలను దాచిపెడుతుందా..?
ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు కాకుంటే.. మరి దేనికోసం వివేకాను హత్య చేయించారు…? హత్య చేశానని దస్తగిరి ఓపెన్ గా చెప్తున్నప్పటికీ.. కేసులో ఎలాంటి పురోగతి లేదేందుకు..? వైఎస్ వివేకా తన ఆస్తులన్నింటినీ సునీత పేరు మీద రాయించారని షర్మిల చెప్పిన దానిలో వాస్తవమెంత..? తనకు ఈ హత్యకు ఎలాంటి సంబందం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్తున్న దానిలో నిజనిజాలేంటి..? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే.. హత్యకు ఆస్తులు కారణం కాదని… ఒకవేళ ఆస్తులే హత్యకు కారణమైతే బాబాయ్ ని కాకుండా సునీతను చంపేవాళ్లని షర్మిల చెప్పారు. ఇక ఈ నేపధ్యంలోనే ఒక ప్రధానమైన అంశం ఒకటి తెరపైకి వచ్చింది. బాబాయ్ తన ఆస్తులన్నింటినీ సునీత పేరు మీద రాయించారని షర్మిల చెప్పినదానికి భిన్నమైన వార్తలు వస్తున్నాయి. వైఎస్ వివేకా 2019 మార్చిలో మరణిస్తే.. 2023 జనవరిలో సునీత పేరున
ఆస్తుల బదలాయింపు జరిగిందని ప్రచారం జరుగుతోంది. వివేకా ఉన్నప్పుడు ఆస్తుల బదలాయింపు జరగలేదని, వివేకా పేరునే ఆస్తులు ఉన్నాయని కూడా ప్రచారం సాగుతోంది. వివేకా హత్యకు ముందు గుండ్రని సీళ్లు ఉన్న ఆస్తి పత్రాలు మాయమైనట్లు సీబీఐ మొదటి స్టేట్మెంట్ లో పేర్కొన్నది .
అవి తన రెండో భార్య షేక్ షమీమ్, కుమారుడు షెహన్షా పేరిట వివేకా రాసిన ఆస్తి పత్రాలుగా అనుమానాలు కలుగుతున్నాయని కూడా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్లో నివశించేందుకు విల్లా కొంటానని వివేకా షమీమ్ చెప్పినట్లు సీబీఐ విచారణలో వెల్లడైంది. ఇక ఇదే అంశాలను వివేకా రెండో భార్య తన స్టేట్మెంట్ లో వెల్లడించారు. ఆస్తుల కోసం వివేకా హత్య జరిగిందని చెబుతున్న అవినాష్ రెడ్డి వాదనకు ఈ ఆధారాలన్నీ బలం చేకూరుస్తున్నాయి. వివేకా హత్య జరిగిన రోజున ఓ లెటర్ ను సునీత, ఆమె భర్త దాచిపెట్టారని, ఆ లెటర్ ను రామ్ సింగ్ బయటకు రాకుండా ఎవరినో కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా అవినాష్ రెడ్డి వెల్లడించారు. మరి సీబీఐ ఈ కోణంలో విచారణ కొనసాగిస్తారో లేదో చూడాలి.