ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. వారిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై ఎట్టకేలకే వేటు పడింది. ఇదే సమాచారాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. వారు క్రాస్ వోటింగ్ కి పాల్పడ్డారు అన్న ఓ తుది నిర్ణయానికి వచ్చిన పిమ్మటనే వారిని సస్పెండ్ చేస్తున్నామని సజ్జల ఈ మేరకు మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ క్రాస్ ఓటింగ్ పై అంతర్గతంగా దర్యాప్తు చేశామని.. అన్ని ఆధారాలతోనే వారిని గుర్తించామని అందుకే ఈ నలుగురిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. చంద్రబాబు నాయుడు వారిని డబ్బులు ఇచ్చి కొన్నారని, తమకున్న సమాచారం ప్రకారం ఒక్కో శాసనసభ్యులకు 10 నుంచి 15 కోట్ల వరకు వెచ్చించి వారిని కొన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు