తిరువూరులో బాబుకి షాక్ ఇచ్చిన తమ్ముళ్ళు రంగంలోకి మరో వైసీపీ లేడీ లీడర్

పెరుగుతున్న వేసవి తాపంతో పాటుApలో రాజకీయాలు వేడెక్కుతూ…అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్న తరుణంలో తిరువూరులో పరిస్థితులు కూడా దాదాపుగా అలాగే ఉన్నప్పటికీ నాయకులలో మాత్రం టిక్కెట్టు టెన్షన్ వెంటాడుతోంది. పార్టీలకు విధేయులుగా పనిచేయాలని తపన ఉన్నప్పటికీ టికెట్టు ఎవరికి దక్కనుందో అని తలలు పట్టుకుంటున్నారు. గెలుపు ఓటములు అలా ఉంచితే… టిక్కెట్టు తమకే వస్తుందని ఆశవాహకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే రక్షణనిధి ఇప్పటికే నియోజకవర్గ౦లో పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ముచ్చటగా మూడోసారి కూడా పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పటికీ అధికార పార్టీలో వర్గభేదాలు భగ్గుమన్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అప్పుడప్పుడు పార్టీ పెద్దలు కొందరు తిరువూరు వచ్చి సమాజాయిస్తూన్నప్పటికి ఇంకా ఒక వర్గం వారు mla మీద గుర్రుమంటున్నట్లు వినిపిస్తున్నాయి. దాంతో స్థానిక ఎమ్మెల్యే రక్షణనిధికి ఒకింత టిక్కెట్టు టెన్షన్ ఉన్నట్లు సమాచారం.

ఇంకా తిరువురులో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం వైస్సార్ సీపీలో చేరి తిరువూరు టిక్కెట్టు రేసులో ఉన్నారు… దిరిశం పద్మజ్యోతి. ఇది కూడా స్థానిక ఎమ్మెల్యే టిక్కెట్టు టెన్షన్ కు ఓ కారణం.ముఖ్యమంత్రి జగన్ అన్న ఆదేశిస్తే పోటీకి సిద్ధం అని ఇప్పటికే పద్మజ్యోతి బహిరంగానే ప్రకటించడం.. ఇటీవల ముఖ్యమంత్రి తిరువూరు పర్యటనలో పద్మజ్యోతికి సముచిత స్థానం లభించడంతో పాటు కొంత మంది పార్టీ పెద్దలతో సంభాషణలు జరుపుతున్న సందర్భంలో 2024 తిరువూరు ఎమ్మెల్యే టిక్కెట్టు పద్మజ్యోతికు తప్పక వస్తుందని ఆమె అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే టీడీపీ పరిస్థితి మరోలా ఉంది. గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం ఉన్న స్వామిదాసు, ప్రస్తుత ఇంచార్జ్ శావల దేవదత్ మధ్య టిక్కెట్టు కోసం పోటీ ఉందనేది ఆ పార్టీ నాయకుల నుంచి బహిరంగంగానే చర్చి౦చుకుంటున్నారు. టీడీపీ ఇంచార్జ్ పగ్గాలు చేపట్టినప్పటినుంచి తిరువూరులో పసుపు జెండా ఎగుర వేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ సొంత పార్టీ వాళ్లే ఆటంకాలు కలిగిస్తున్నారనేది రాజకీయ వాదుల మాట. అసలు టీడీపీ జెండా తిరువూరులో ఎగరక పోవడానికి కారణం ఈ వర్గ పోరు అని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. అసలు గతంలోనే 2019 ఎన్నికలలో స్వామిదాసు కి టిక్కెట్టు వచ్చి ఉంటే పసుపు జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అప్పుడే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఏది ఏమైనా తిరువూరు నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరకపోతే భవిష్యత్తులో పార్టీని మర్చిపోవాల్సిందేనని ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగానే చర్చించుకుంటున్నారు. ఇటువంటివి క్లిష్టతరమైన పరిస్థితులలో పార్టీని నిలబెట్టే అవకాశం ఎవరికి వస్తుందా అని నాయకుల కంటే ఎక్కువ కార్యకర్తలు టెన్షన్ పడటం గమనార్హం. ఇలా టిక్కెట్టు టెన్షన్ తీరితే కానీ తిరువూరు ఓటర్లు ఎటు వైపో తేలుతుందని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.