పొలిటికల్ వార్ లో సిఎం జగన్ ఆలోచనే వేరు.. ప్రత్యర్ధులక దడపుట్టించే విధంగా ఉంటాయి ఆయన వ్యూహాలు.. ఆయన చేసే రాజకీయాల అర్ధం కాక ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకుంటున్నాయి.. ఎటు నుంచి నరుక్కోస్తున్నారో ఆఖరికి సొంత పార్టీ నేతలకు సైతం అంటూ చిక్కని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేయడమే లక్ష్యంగా తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. వై-నాట్ వన్ సెవంటి ఫైవ్ అంటూ చేసిన సవాల్ కి కట్టుబడి సిఎం జగన్ ఒక్కో నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 175 నియోజకవర్గాలలో వైసీపీ తప్పకుండా విజయం సాధించాలంటే ఎం చేయాలో అన్న ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా టిడిపి లో బలమైన నాయకుల అడ్డాలో తమ జెండా ఎగరవేసేందుకు, బలమైన నాయకులు అంటే చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు.. ఇలా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను ఓడించేందుకు సిఎం జగన్ పక్క ప్లాన్ తో ముందుకు సాగుతున్నారన్నది విశ్లేషకుల భావన. నియోజకవర్గాలలో ఎవరికి టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తారు.. ఏ నాయకులకు జనాదరణ ఉంది.. ఇలా అన్ని కోణాలలో సర్వేలు చేయించి మరీ.. అభ్యర్ధులను రంగంలోని దించుతున్నారని వార్తలు వస్తున్నాయి. కుప్పంలో చంద్రబాబుని ఓడించాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అక్కడ భారత్ ను పోటీలోకి దించుతున్నట్టు సం జగన్ ఎప్పుడో ప్రకటించారు. ఇక ఈ నేపధ్యంలోనే.. టిడిపి లో బలమైన నాయకుడు అచ్చెన్నాయుడు సీటుపై సీఎం గట్టి ఫోకస్ పెట్టారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దువ్వాడ వాణిని ఎన్నికల బరిలో దింపనున్నట్లు తెలుస్తోంది. ఆమె- వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య. గతంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా పని చేశారు. టెక్కలి టికెట్‌ను దాదాపుగా ఆమెకే దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే విషయాన్ని దువ్వాడ శ్రీనివాస్ కూడా తాజాగా ప్రకటించారు. దువ్వాడ వాణి టెక్కలి నియోజకవర్గం నుండి భరిలోకి దిగితే.. వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నాయుడికి చెక్ పడటం ఖాయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ విషయాన్ని సిఎం జగన్ అధికారకంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.