రాజకీయాలలో శాశ్వత మిత్రులు. శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. రాజకీయాలలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవ్వరికీ అంతు చిక్కని రహస్య౦. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో జ౦పింగులు జరుగుతున్నాయి. తాజాగా బీజేఏపీ నేత కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో కి జంప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేనకు చెందిన ఓ కీలక నేతకు టిడిపి భారీ ఆఫర్ ప్రకటించిందని, ఆయన త్వరలో టిడిపి తీర్ధం పుచ్చుకొనున్నారని కూడా సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ జంపింగ్ కోసం.. చర్చలు కూడా పూర్తయినట్టుగా.. దీనికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే.. సరిపోతుందన్నట్టుగా ఒక ప్రచారం జోరుగా సాగుతోంది.
జనసేనలో నాదెండ్ల మనోహర్ అంటే పవన్ తర్వాత మరో నాయకుడు అని చెప్పాలి. మరి అలాంటి వ్యక్తి జనసేనను వదిలి రావడం అంటే కొద్దిగా నమ్మశక్యంగా లేని విషయమే. కానీ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి నాదెండ్ల కుటుంబానికి టిడిపి కి అప్పట్లో వైరం నడిచింది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు.. కుమారుడు ఈయనే కావడం.. ఇలా ఎన్నో రకాల ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నాదెండ్ల మనోహర్ నాయకుడిగా ఓ వెలుగు వెలుగుతున్నారు. జనసేనలో నెంబర్ 2 గా ఉన్న ఈయన పార్టీని వదిలేసుకుంటారా? అన్నదే అసలైన ప్రశ్న. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారానికి నాదెండ్ల మనోహర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.