రెబల్ ఎమ్మెల్యేకు భారీ షాక్ సీబీఐ వద్ద ఆధారాలున్నాయన్న వర్ల రామయ్య టీడీపీ నేత పరార్

1.మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ అనుమతులు…
ఇప్పటికే ఏలూరు, నంద్యాల, విజయనగరం వైద్య కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు మొదలు పెట్టడానికి లైన్ క్లియర్

2.ఈ నెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం…
ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడి.

3.సీఎం జగన్ ను కలిసిన పలు ఉద్యోగ సంఘాల నేతలు…
టీడీపీ హయాంలో తొలగించిన 500 మంది మండల సమన్వయకర్తలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో అవకాశం కల్పించటంపై హర్షం వ్యక్తం.

4.ఏపీ భవన్కు సంబంధించి మొత్తం 19.73 ఎకరాల్లో 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్కు, 7.64 ఎకరాలు తెలంగాణకు..
కేంద్రం ప్రతిపాదనను స్వాగతించిన ఏపీ, స్వాగతించిన ఏపీ

5.రియల్ ఎస్టేట్ వెంచర్ ను ధ్వంసం కేసులో బీటెక్ రవి పరార్..
ఎంపీ సీఎం రమేష్ సహకారంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి జంప్..నమ్ముకున్న అనుచరులు జైలుపాలు.

6.రైతుల ఎల్ఆర్ అప్లికేషన్‌పై మే 9న సుప్రీం కోర్టులో విచారణ
జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ

7.జగన్ మ్యానిప్యులేషన్ వల్లే అవినాశ్ రెడ్డి అరెస్ట్ కావడం లేదు..
అవినాశ్ పై ఆధారాలు ఉన్నాయని సీబీఐ నివేదిక ఇచ్చిందన్న వర్ల రామయ్య.

8.​మహిళలకు మంచి రోజులు రావాలంటే ‘ఫ్యాన్’ వద్దమ్మా!:
పాదయాత్రలో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో మహిళల సమావేశలో లోకేశ్ వ్యాఖ్యలు

9.జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు భారీ షాక్..
ఇటీవల దొంగ ఓట్లే తన విజయానికి సహకరించాయని చేసిన వ్యాఖ్యలపై విచారణ ఎన్నికల సంఘం ఆదేశం.

10.ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ.. !
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటన