పాలిటిక్స్ లో బలమైన అభ్యర్ధిని ఢీ కొట్టాలంటే.. ప్రత్యర్ధి కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. లేదంటే గేమ్ వన్ సైడ్ అయ్యడం చాలా ఈజీ.
ప్రస్తుతం నెంబర్ వన్ గా పాలన కొనసాగిస్తూ.. రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్న జగన్ సర్కారును ఓడించడం కోసం ప్రతిపక్షాలు టార్గెట్ గా పెట్టుకున్నాయి. మరి అది అంత ఈజీనా అంటే కాదని ప్రతిపక్ష పార్టీలకు కూడా బాగా తెలుసు. అందుకే కదా పొత్తులు, ఎత్తులు. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడద౦టూ పవన్ తెగ ఊగిపోతున్నారే తప్ప.. పార్టీని నమ్ముకున్న క్యాడర్ కోసం ఆలోచించట్లేదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన తరుపున వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాలలో అభ్యర్ధులను భరిలోకి దించుతున్నారో క్లారిటీ లేదు. అసలు అంతెందుకు ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారో కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సీన్ కట్ చేస్తే.. పొత్తులలో అసలు లెక్కలు సీట్లు కేటాయింపులోనే ఉన్నాయి. పొత్తుల లెక్కలు కొలిక్కి రాలేదు. ఈ తరుణంలోనే టీడీపీ నేతలు పలువురు.. ఎవరికి వారు తామే అభ్యర్థులమంటూ ప్రకటనలు ఇచ్చేసుకుంటున్నారు. ఇలాంటి వేళ.. పవన్ తో పొత్తులు పెట్టుకున్న వేళ పరిస్థితి ఏమిటి.? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇక అసలు విషయనికొస్తే.. జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ కు టికెట్ ఇవ్వలేని స్థితిలో పవన్ ఉన్నారని ప్రచారం సాగుతోంది. 2019లో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన అత్యంత ఘోరంగా ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ 17వేల ఓట్లతో ఓడారు. పొత్తుల్లో భాగంగా నాదెండ్ల కోసం తెనాలి టికెట్ ను చంద్రబాబు వదులుకోవటం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అవినీతి చేసిన ప్రతీ ఒక్కరి గుండెల్లో నిద్రపోతా ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తాను పోటీలో లేనని సంతోషిస్తున్న వారందరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే,.. సత్తెనపల్లి నుంచి కూడా టికెట్ దక్కే అవకాశం అస్సలు లేనే లేదు. అక్కడ కన్నాను ఆల్రెడీ ఇంచార్జ్ గా ప్రకటించింది టిడిపి అధిష్టానం. మొత్తానికి నాదెండ్లకు సీటు లేదన్న మాటాయితే.. తెగ ప్రచారం సాగుతోంది.