ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. గత ఎన్నికల్లో నా వాళ్ళే నన్ను గలిపించలేదని కాపులను ఆడిపోసుకున్నాడు.. 2019 ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. అంతకుముందు చంద్రబాబును కలిసి.. సీట్ల గురించి ఎందుకు చర్చించారు. తమ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందో చంద్రబాబుకి చెప్పాల్సిన అవసరం ఏంటి..? పొత్తులతో పోటీ చేస్తే మీరు గెలవరు, మేము గెలవం అని చంద్రబాబు మీకు చెప్పలేదా..? ఈ మాట నువ్వే కదా అన్నావు. ఆ తర్వాత 2018 లో బాబుతో లెక్కల్లో తేడా వచ్చినప్పుడు..అమరావతి ఒక కుల రాజధాని అని, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఇక్కడ బతకగలరా? అని నువ్వే కదా అన్నావు. నేను టీడీపీని దగ్గరుండి గెలిపిస్తే మా అమ్మను తిట్టించారు టీడీపీ నేతలు వీళ్లదీ ఒక పుట్టుకేనా? అని నువ్వే కదా అన్నావు.. నన్ను చంపడానికి టీడీపీ నేతలు సుపారీ ఇచ్చారు అని నువ్వే కదా అన్నావు. చంద్రబాబు, లోకేష్ లు అధికారం ముసుగులో లక్ష ఎకరాలు, లక్ష కోట్లు దోచుకున్నారని.. అని నువ్వే కదా అన్నావు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడేమో అదే చంద్రబాబుతో చేతులు కలిపావు. ఒకసారి ఈ ఆడియో వింటే ఓ క్లారిటీ వస్తుంది.
ఇప్పుడు చెప్పండి.. ఎల్లో మీడియాలో కథనాలు ఎవరు చెప్తే తెరపైకి వస్తున్నాయో..? ఇప్పుడు చెప్పండి .. ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలతో వార్తలు రాయిస్తుంది ఎవరో..? ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయాలు పేపర్ లో కు ఎలా వస్తాయని స్వయంగా పవన్ కళ్యాణే 2019 ఎన్నికల సమయంలో నిలదీశారు. చంద్రబాబు చెప్పకపోతే.. వారిద్దరూ మాట్లాడుకున్న విషయాలు ఎలా పబ్లిక్ అవుతాయని నిలదీసింది నువ్వే కదా అన్నావ్. మళ్ళీ ఇప్పుడు ఈ పొత్తుల కథ ఏంటి పవన్.
అసలు పవన్ కళ్యాణ్ నటుడా..? హిప్నటిస్టా..? ఆయన తన కోసం రాజకీయాలు చేస్తున్నారా..? లేక ఇంకెవరినైనా సిఎం ని చేయడానికి రాజకీయాలు చేస్తున్నారా..? ఆయనకు ప్యాకేజీ అందితే చాలు హిప్నటిస్ట్ గా మారిపోతారా..? ప్రస్తుతానికి ఆయన అభిమానులను హిప్నటైజ్ చేసి చంద్రబాబుని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు. సిఎం పదవి ఊరికే రాదు.. పొత్తులు పెట్టుకోవాలి కానీ కండీషన్లు పెట్టకూడదు. బలం చూపించి.. సత్తా చాటి.. పదవులు తీసుకోవాలి ఇలాంటి డైవర్షన్ మాటలతో జనసైనికులను టిడిపి ట్రాప్ లోకి తీసికెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కేఏ పాల్ అన్నట్టుగా నీకసలు స్థిరత్వం ఉందా.. పవన్ ప్యాకేజి స్టార్ అని ముందు నుంచి చెబుతున్నానని తాను ఎప్పుడో చెప్పానని కేఏ పాల్ ఎప్పటి నుంచే చెప్తున్నారు. అసలు కేఏ పాల్ కి ఉన్న స్థిరత్వం కూడా పవన్ కళ్యాణ్ కి లేవని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
సీన్ కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో బాబు, పవన్ పక్కా ప్లాన్ తోనే ఎన్నికల భరిలోకి దిగారు అనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ప్రజల్లో నా పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది, నా వ్యతిరేక ఓట్లు పూర్తిగా జగన్‌కు పడకుండా నువ్వు విడిగా పోటీచేసి నాకు సహకరించాలని బాబు నిన్ను ఆదేశించాడు. అందులో భాగంగా జగన్‌కు దళిత ఓట్లు దూరం చేయాలని నిన్ను మాయావతితో పొత్తుపెట్టుకోవాలని బాబు చెప్పాడు. అప్పటి వరకు ఇన్‌చార్జిలుగా ఉన్న జనసేన అభ్యర్థులను రాత్రికిరాత్రే మార్చి, వైసీపీ ఓటు బ్యాంకును నష్టపరిచే విధంగా బాబు చెప్పిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చావు. ముద్రగడ ఉద్యమం నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న కాపులు వైసీపీకి ఓటు వేస్తారని భావించి ఎక్కువ శాతం సీట్లు కాపులకు ఇచ్చావు. జనసేన బీఫాం నాకు ఇచ్చి నీకు ఇష్టం వచ్చిన వారికి టికెట్ ఇచ్చుకో’’ అని చెప్పారని స్వయంగా 2019 ఎన్నికల ఫలితాల అనంతరం వల్లభనేని వంశీనే చెప్పారు. పవన్‌వన్నీ పెయిడ్ అరుపులే, బాబుతో అవగాహన ఉందని కూడా చెప్పారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఏమని సమాధానం చెప్తారు.