చరిత్రలో తొలిసారి కోర్టు సంచలన తీర్పు

శరీర సుఖం కోసం వావి వరసలు మరిచి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి కోవకు చెందిన ఒక తండ్రి కన్న కూతురిపై అత్యాచారం చేసి.. మానవ మర్యాదలకు భంగం కలిగించేలా చేశాడు. కూతురు గర్భం దాల్చడానికి కారణం అయ్యాడు.. ఆ కీచక తండ్రి. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అతడు బతికి ఉన్నంత వరకు జైలులోనే ఉంచాలని ఆదేశించింది. అంటే యావజ్జీవ కారాగారశిక్షఅన్నమాట. కన్న కూతురిపై కనికరం లేకుండా పాడు పనికి కాలు దువ్విన ఈ ఘటనపై కోర్టు తీర్పుతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతో మంది దుర్మార్గులు మత్తుకు బానిసై వావివరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ తీర్పు వల్ల అయినా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఫిలింనగర్‌లో నివసిస్తోంది. కుటుంబ యజమాని సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, అతడి భార్య స్థానికంగా ఇళ్లలో పనిచేస్తోంది. వీరికి 14 ఏళ్ల కుమార్తె, కుమారుడు ఉన్నారు. జులై 2021లో కుమార్తె అనారోగ్యం బారినపడి వాంతులు చేసుకోవడంతో తల్లి ఆమెను ఆసుపత్రిలో చూపించింది. పరీక్షించిన వైద్యులు ఆమె నాలుగు నెలల గర్భణి అని చెప్పడంతో ఆ తల్లి గుండె ఆగినంత పనైంది. ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి భోరున విలపించింది.భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసును విచారించిన నాంపల్లిలోని 12వ అదనపు ఎంఎస్‌జే కోర్టు తుదితీర్పు వెలవరించింది.