పచ్చ మీడియాకి కరెంట్ షాక్ బాబుకి ఊచకోత

సిఎం జగన్ కు, ఎల్లో మీడియాకు ముఖాముఖి యుద్దం ముదిరినట్లు కనిపిస్తోంది. తాము యుద్దం మారీచులతో అంటూ సిఎం జగన్ చాసార్లు బహిరంగంగానే ప్రకటించారు. తప్పులు కప్పి పుచ్చడం లేదా భూతద్దంలో చూపించడం ఈ రెండు పనులను ఎల్లో మీడియా బ్రహ్మాండంగా చేయగలదు అంటూ.. నేరుగా వారి పేర్లను కూడా చెప్పుకోస్తారు. ప్రతి ప్రభుత్వ పాలనలోనూ మంచీ వుంటుంది చెడూ వుంటుంది. కానీ అవే కథనాలు చంద్రబాబు హయాంలో ఎందుకు రాయలేదు. బాబుగారి పాలనలో ప్రజాలక౦తా మంచే జరిగిందా..? అంటే లేదనే చెప్పాలి. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుతూ.. కేవలం కొద్దిపాటి మంచినే రాస్తూ బాబుని ములకచెట్టు ఎక్కించింది పచ్చ మీడియా. ఆ పచ్చ మీడియా ఏది రాస్తే అది నమ్మేయడానికి ఆ రోజులు పోయాయి. సోషల్ మీడియా యుగం వచ్చిన దగ్గర నుంచి ఏది మంచి, ఏది చెడు అన్నది ప్రజలు క్లియర్ గా అర్ధం చేస్కోగలుగుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. పచ్చ మీడియా రాసే తప్పుడు వార్తలు చూస్తే.. హతవిధి.. ఏమిటిది.. అన్న ప్రశ్న రాక మానదు. కష్టాలు కనలేరా? కరెంటు కొనలేరా? అంటూ తాజాగా ఓ పచ్చ మీడియా ఈ వార్తను ప్రచురించింది. గ్రామాల్లో ఎడాపెడా కోతలట.. రాత్రి వేళల్లో కనీసం 2 నుంచి 3 గంటలపాటు నిలిచిపోతున్న సరఫరా అంటూ ఆ కథనంలో ఇలాంటి మాటలను వండి వార్చి౦ది. ఇక ఈ వార్తలపై ఏపీ విద్యుత్‌ సంస్థలు స్పందించాయి.ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ అమల్లో లేవని తేల్చి చెప్పాయి. గత కొన్ని రోజులుగా కొన్ని మీడియా వర్గాల్లో వస్తున్నట్లు ఏపీలో విద్యుత్‌ కోతలు లేనే లేవని క్లారిటీ ఇచ్చాయి…ప్రతీ రోజు 2 నుంచి 3 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారనడం పూర్తిగా అబద్ధమని, వాస్తవాలను వక్రీకరించడమేనని చెప్పుకొచ్చాయి. రోజు వారీగా డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నామన్నారు. బాబుగారి టైమ్ లో అసలు కరెంట్ కోతలే లేనట్టు.. జగన్ ప్రభుత్వంలోనే కరెంట్ కోతలు ఉన్నట్టు.. ఈ పచ్చ మీడియా కోతలకు జనం ఔరా అంటున్నారు. చంద్రబాబును మళ్ళీ సిఎం ను చేయడం కోసం.. జగన్ ప్రభుత్వంపై నిత్యం బురద జల్లుతూ.. తప్పుడు కథనాలు రాస్తూ.. ఎన్ని జాకీలు వేసినా బాబు మళ్ళీ సిఎం అవడం జరగని పనని స్వయంగా ప్రజలే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి ఊచకోత తప్పదని జనం ముక్తకంఠంగా చెప్తున్నారు.