జగన్‌ను గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయి పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన మారీచుని మాటలను నమ్మొద్దన్న రఘురామ

1.జగనన్నే మా భవిష్యత్తు.. మా నమ్మకం నువ్వే జగన్’ పేరుతో జనంలోకి వైసీపీ..
45 నెలల పాలనను చాటిచెప్పడం.. విపక్షాలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యం అంటున్న వైసీపీ శ్రేణులు.

2.సీఎం జగన్ కాలికి గాయం..నిన్న ఉదయం వ్యాయామం చేస్తుండగా బెణికిన కాలు..
నేటి ఒంటిమిట్ట పర్యటన రద్దు.

3.భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న ఏపీ ఉద్యోగ సంఘాలు..
డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట.

4.విభేదాలను పరిష్కరించే బాధ్యత మీదే ..
రీజనల్ కో ఆర్టినేటర్లకు జగన్ దిశానిర్దేశం.

5.జనసేన-బీజేపీ అజెండా ఒకటే.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం..
ఢిల్లీ పర్యటనలో పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన.

6.ఏపీలో 15 అరుదైన ఖనిజ లవణాల గుర్తింపు..
ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అనంతపురం జిల్లాలోని పలుచోట్ల సయనైటిస్ వంటి సంప్రదాయేతర శిలలపై పరిశోధనలు.

7.ఎన్నికల ముందు నేల జగన్… ఇప్పుడు గాలి జగన్..
ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు జగన్ అహంకారం నేలపైకి వచ్చిందని లోకేష్ సెటైర్లు.

8.విచారణ పేరుతో రామోజీరావును వేధించడం విచారకరం.. .
సామాజిక మాధ్యమాల్లో ఆయనపై కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని నాగబాబు ట్వీట్.

9.అమరావతికి మారీచుడు సీఎం జగనే, ఆయనతోనే ప్రజలంతా యుద్ధం చేయాలనుకుంటున్నారు…
ప్రజలు హైకోర్టును అపార్థం చేసుకోవద్దని.. మారీచుని మాటలను నమ్మొద్దని రఘురామ విజ్ఞప్తి

10.ప్రజాస్వామిక పరిపాలనను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్న జగన్‌ను గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయి..
సామాన్యుడి జీవనాన్ని జగన్‌ అతలాకుతల చేస్తున్నాడని రావి వెంకటేశ్వరరావు విమర్శ.