టీడీపీ హయాంలో భూ కబ్జాలపై విచారణ ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం హైకోర్టు ధర్మాసనం తీర్పు

1.నేడు మహిళల ఖాతాల్లోకి వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత నిధులు జమ..
దెందులూరులో పర్యటనలో భాగంగా బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాలోకి నగదు జమ చేయనున్న సిఎం జగన్.

2.రాష్ట్రంలో మొదటిసారిగా 46 కోట్లు వ్యయంతో గన్నవరంలో వైఎస్సార్ విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం..
భూమిపూజ చేసి పనుల్ని ప్రారంభించిన మంత్రి కాకాణి, మంత్రి ఆర్కే రోజా,ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

3.టీడీపీ హయాంలో భూ కబ్జాలపై విచారణ జరపాలి..
ఆఖరి రోజు జరిగిన శాసనసభలో పలువురు వైసీపీ సభ్యులు డిమాండ్

4.పొగాకు, పొగాకు ఉత్పత్తులు ఆహార నిర్వచనం పరిధిలోకి రావు..
వాటిని నిషేధించే అధికారం ఆహారభద్రత కమిషనరుకు లేవని హైకోర్టు ధర్మాసనం తీర్పు.

5. వైసీపీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలను తొలగిస్తారని ప్రచారంలో ఉంది..
ఎమ్మెల్యేలకు విలువ, గౌరవం ఇవ్వని పార్టీలు మూతపడక తప్పదని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

6.ఏపీ సీఎస్ తో ముగిసిన ఉద్యోగ సంఘాల సమావేశం..
కంట్రిబ్యూషన్ డబ్బును ఆరోగ్యశ్రీ ట్రస్టులో ఉంచాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం.

7.ఆంధ్రప్రదేశ్ ను గంజాయిప్రదేశ్ గా మార్చారు..
తిరుమల కొండపై గంజాయి కలకలంపై జగన్ ప్రభుత్వాని విమర్శించిన నారా లోకేశ్

8.షాపూర్ పల్లోంజీ అంటూ సీఎం జగన్ మరో కట్టుకథ అల్లారు: బోండా ఉమ
అమరావతి నిర్మాణాల్లో అవినీతి అంటూ జగన్ నాలుగేళ్ల నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారన్న బోండా ఉమ..చర్చకు సిద్ధమా అంటూ సవాల్.

9.మా పక్కనే కూర్చొని, మాతోనే వుంటూ టీడీపీకి ఓటు వేసిన వారికి పుట్టగతులుండవ్..
ఆ నలుగురు పై మంత్రి రాంబాబు ఫైర్

10.పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు నుంచి ప్రాణహాని ఉంది..
స్థానిక వైఎస్సార్‌సీపీ నేత దండా నాగేంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు.