కేంద్ర౦ చెప్పిన ఆ ఒక్క మాటతో తోక ముడిచిన పచ్చ మీడియా సెగలు పుట్టించే వీడియో

వార్త ఏదైనా అబద్ధమే అజెండా. నిజాలతో పనిలేదు. నిజాలు చెప్పే ఊసే లేదు. ప్ర‌జ‌ల్లో అపోహ‌లు, అనుమానాలు క‌లిగించాల‌నే కుట్ర‌. రాష్ట్రం అప్పుల పాలవుతుందంటూ ఒకరోజు, రాష్ట్రంలో అభివృద్ది లేదంటూ మరోరోజు, ఉద్యోగాలే లేవంటూ ఒకరోజు.. ఉద్యోగులకు జీతాలే ఇవ్వట్లేదంటూ మరోరోజు, ఇలా పచ్చ మీడియాలో ప్రతి రోజు మొదటి పేజీలో ఒక త‌ప్పుడు క‌థ‌నం ప్రచురించడం జరుగుతుంది. ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ ఇలా ఏదో ఒకటి, ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కధనాలు సృష్టించి చూపించడమే ఎల్లో మీడియాకి తెలిసిన విద్య.
రాష్ట్రంలో ఉద్యోగాలు లేవంటూ పచ్చ మీడియా ఒకటి తాజాగా వండిన కథనం ఈ కోవలోనిదే. అసలు ఈ ప్రభుత్వం ఉద్యోగాలే ఇవ్వలేదట, నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందట. గతం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది.. ఈ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పే దమ్ము పచ్చ మీడియాకి ఉందా..? చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య కేవలం 34 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మబలికి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జాబు లేదు ఏమీ లేదు. ఇస్తానన్న నిరుద్యోగ భృతిలో కూడా కటింగ్ లే. దేశంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాల్గో స్థానంలో ఉందంటేనే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వటలేదని బాబు అండ్ కో ప్రచారం చేయడం అబద్దం కాదంటారా..? 2018– 19లో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉండగా… ఇపుడది 4.2 శాతానికి తగ్గినట్లు స్వయంగా కేంద్ర కార్మికమంత్రిత్వ శాఖ ప్రకటించింది.

తాజాగా పచ్చ మీడియా ఒకటి మరో తప్పుడు కథనాన్ని వండి వార్చి౦ది. ఎవ‌రికీ ప‌రిచ‌యం లేని ఒక వ్య‌క్తిని తీసుకొచ్చి ఆర్థిక నిపుణుడంటూ ఆయ‌న చెప్పిన‌ట్టుగా ఈనాడు మొదటి పేజీలో ఒక త‌ప్పుడు క‌థ‌నం రాయించారు. ఇలాంటి ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తే మహా ప్రమాద౦ అంటూ.. ఏపీ దివాలా అంచులలో ఉందంటూ, ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పు అంటూ.. ఈనాడు మొదటి పేజీలో ఈ వార్త ప్రచురితం అయ్యింది. ఆయన మరెవరో కాదు.. ఆడిటర్ జీవీ రావు చౌదరి. ఈయనకు చంద్రబాబుకు ఎలాంటి సంబందం లేదంటారా..? ఒక చార్టర్డ్ అకౌంట్ సంస్థ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి ఇతను. ఇతనిని తెచ్చి నిపుణుడు అంటూ.. కట్టు కధ అల్లి.. ప్రభుత్వంపై తప్పుడు రాటాలు రాసి పచ్చ మీడియా అడ్డంగా దొరికిపోయింది. ఈ ఆధారాలు బయటకు రావడంతో ఎల్లో మీడియా దెబ్బకి తోక ముడిచింది. ఇప్పటికైనా పచ్చ మీడియా కాస్త ముందు వెనక చూస్కోనీ వార్తలు రాస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.