స్థానిక ఉప ఎన్నిక వైసీపీ లేడీ లీడర్ భారీ విజయం ఆట ఆరంభం..

ఎన్నిక ఏదైనా.. ప్రాంతం ఎక్కడైనా.. పోటీ ఎవరైనా.. విక్టరీ కొట్టేది మాత్రం వైసీపీనే. ఇప్పటి వరకు అదే విజయం పరంపర. స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఏర్పడిన ఖాళీలకు నిన్న జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో ఉన్న కవురు శ్రీనివాస్ ఎమ్మెల్సీగా వెళ్లడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ స్థానానికి పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏలూరు జిల్లా నూజివీడు పురపాలక సంఘం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా 22వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కొమ్ము వెంకటేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా వైసీపీ ఎంపీటీసీ ముప్పిడి సరోజని, నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వైసీపీ నాయకురాలు బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్‌గా కోనేటి రామకృష్ణ, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా-1గా వైసీపీ నేత ముచ్చు లయయాదవ్, అదే జిల్లా ఎల్.కోట మండల పరిషత్ రెండో వైస్ ఎంపీపీగా భీమాళి వైసీపీ ఎంపీటీసీ మధునూరు శ్రీనివాసవర్మరాజు, గుంటూరు జిల్లా తెనాలి మున్సిల్ రెండో వైస్ చైర్మన్‌గా 40వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అత్తోట నాగవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏవిధంగా మరికొన్ని జిల్లాలలో ఎంపీపీ స్థానాల్లో వైసీపీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావటానికి ఈ ఎన్నికలే నిదర్శనమని రాజకీయ నిపుణులు అంటున్నారు. ప్రజలు జగన్ వైపు ఉన్నారు కాబట్టే ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీకి వరుస విజయాలు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట.