బెజవాడ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీలో కీలకంగా ఉన్న ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. కొన్నిరోజులుగా ఎంపీ కేశినేని నాని పార్టీపై దిక్కార స్వరం వినిపిస్తున్నారు. తనను కాదని.. వేరే వారికి ఎవరికైనా టికెట్ ఇస్తే.. వారి ఓటమి కోసమే పని చేస్తా అంటూ.. పెద్ద పెద్ద బాంబులు పేల్చుతూ వస్తున్నారు. వరుసగా వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొద్ది రోజుల క్రితం నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ తో కలిసిన పాల్గొన్న కార్యక్రమాల్లో ఆయన్ను అభినందించారు. గతంలో తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధితో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తో కలిసి కార్యక్రమాలకు హాజరైన సమయంలో.. కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీతో తాడో పేడే తేల్చుకోవటానికి సిద్దమైనట్లు స్పష్టం అవుతోంది. ఎన్నికల్లో ఏ పిట్టల దొరకు సీటు ఇచ్చినా తనకు ఇబ్బంది లేదన్నారు. ప్రజలు కోరుకుంటే తాను స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయటానికి సిద్దమని కీలక వ్యాఖ్యలు చేసారు. తన మనస్తత్వానికి సరిపోయే ఏ పార్టీ అయినా తనక ఓకే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేశినేని చేసిన కామెంట్స్ బట్టి చూస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారనే అనే టాక్ వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన సమయంలో టిడిపి ఎంపీలు ఇచ్చిన ఫ్లవర్ బుకే ను నాని నెట్టివేశారు. అసలు కేశినేనని నానికి టిడిపి కి ఎక్కడ చెడింది అంటే.. ప్రధానంగా ఒక్కటే మాట వినిపిస్తోంది. గ్రూపు రాజకీయాల వల్ల ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేవినేని ఉమా, బోండా ఉమా, బుద్దా వెంకన్న.. ఇలా సొంత పార్టీ నాయకుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తుతులు నెలకొన్నాయని కూడా అంటున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే కేశినేని నాని పార్టీపై వ్యతిరేకత చూపడ్డాన్ని ఛాన్స్ గా తీసుకున్న వైసీపీ.. నానిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరో వైపు బీజేపీ కూడా నానినికి స్వాగతం పలుకుతున్నారని ప్రచారం జోరందుకుంది. మరి కేశినేని నాని చివరికి ఏ పార్టీలో ఉంటారు.. ఒకవేళ ఆయన స్వాతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేస్తారా..? లేక తెర వెనుక ఇంకేమైనా కథ నడిపిస్తారా అన్నది తెలియాలంటే.. ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే..