వైఎస్ వివేకా హత్య కేసులో అసలు నిర్దోషులు ఎవరు..? అన్న సస్పెన్షన్ వీడే క్రమంలో కొన్ని సంచలన నిజాలు ఒక్కొకటిగా బయటకొస్తున్నాయి. అసలు వివేకా హత్య వెనుక టీడీపీ ముఖ్య నేతల పాత్ర ఉందని.. ఇలా నానా రకాల వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే.. గత కొద్ది రోజుల నుంచి మరో చర్చ తెరపైకి వచ్చింది. వివేకా కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడం వెనక చంద్రబాబు హస్తం ఉందని, దస్తగిరికి పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పి తెరవెనుక చంద్రబాబే కథ నడిపిస్తున్నారని తెగ ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యంలోనే కడపజిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత రాజకీయాల్లోకి ప్రవేస్తున్నారని, అది కూడా టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారని.. సునీత పేరుతో
పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్ ల పొటోలు కూడా ఉండటంతో ఒక్కసారిగా ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్ ను రాజేసింది. రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న డాక్టర్ వైఎస్ సునీతమ్మగారికి స్వాగతం సుస్వాగతం అంటూ ఫ్లెక్సీల్లో రాసి ఉన్నాయి. అసలు దీని వెనక ఎవరున్నారు..? ఇదంతా టిడిపి ఆదిస్తున్న మైండ్ గేమ్ ఆ..? నిజంగానే సునీత రాజకీయాలలోకి రానున్నారా..? అది కూడా టిడిపిలోకి..? చాలా కాలం నుంచి ప్రచారం అవుతున్న ఈ వార్తలపై సునీత ఇంకా ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు…? ఇక ఇదే అంశంపై తాజాగా రాంగోపాల్ వర్మ రియాక్ట్ అవుతూ.. సంచలన ట్వీట్ ఒకటి చేశారు. వివేకాను హత్య చేసిన దస్తగిరికి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని
వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు.. దస్తగిరికి ఎంపీ టికెట్ ఇస్తే.. సునీత ప్రచారం చేస్తారని వర్మ రెండ్రోజుల క్రితం ట్వీట్ చేశారు. ఇప్పుడు చూస్తే.. సునీత రాజకీయాలలోకి వస్తున్నారని.. ప్రొద్దుటూరులో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. మరి దీనిపై టిడిపి గానీ, సునీత గానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.