సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న టీడీపీకి షాక్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తేల్చి చెప్పిన తెలంగాణ హైకోర్టు

1.టిడ్కో ఇళ్ల పథకాన్ని గాలికొదిలేసిన గత ప్రభుత్వం.. ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయలేదు…
ఈ పథకాన్ని చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నది తమ ప్రభుత్వమేనని సిఎం జగన్ స్పష్టం.

2.సీఐడీ అధికారుల విచారణకు మార్గదర్శి ఉద్యోగులు సహకరించాల్సిందే..
తేల్చి చెప్పిన తెలంగాణ హైకోర్టు.

3.సిఎం జగన్ చొరవతో కిడ్నీ వ్యాధి బాధితునికి భరోసా..
లక్ష ఆర్థిక సాయాన్ని అందజేసిన ప్రకాశం కలెక్టర్.

4.7 కోట్లతో ఇచ్ఛాపురం మండలం బొడ్డబడ బ్రిడ్జిని నిర్మించిన ఘనత తమదేనని సెల్ఫీతో ఎంపీ రామ్మోహన్ నాయుడు సెల్ఫ్ డబ్బా ..
ఆ వంతెన కాంగ్రెస్ హయాంలో మంజూరైనట్టు సెల్ఫీ ప్రతిస్పందించిన కి బొడ్డబడ గ్రామస్తులు.

5.గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న అధికారులు…
అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం.

6.గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తులసి వనంలో గంజాయి మొక్కలా మారాడు..
బూతుల ఎమ్మెల్యే రోడ్లు వేయకున్నా కేసినో, క్యాబరే డ్యాన్సులు తెచ్చాడని చంద్రబాబు మండిపాటు.

7.దళితులకు సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యం..
ఎస్సీల సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందన్న లోకేశ్.

8.మేకల్ని బలి ఇస్తారు, పులులను బలి ఇవ్వరు… కాబట్టి పులుల్లా బతకండి..
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం అందరికీ స్పూర్తిదాయకమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు.

9.వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..
సీబీఐ అదుపులో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి.

10.విశాఖలోని రామానాయుడు సినీ స్టూడియోపై సీఎం జగన్మోహన్‌రెడ్డి కన్నుపడింది ..
అందుకే అక్కడ ఇళ్ల నిర్మాణాలకు జీవీఎంసీ అనుమతి ఇచ్చిందని బండారు సత్యనారాయణమూర్తి ఆరోపణ.