గన్నవరంలో విధ్వంసకాండ ఎవరు చేశారో..? అందుకు గల పాత్రదారులు, సూత్రదారులు ఎవరో..? ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతుంది. తప్పు చేసింది ఎవరో.. పట్టాభి మొహం చూస్తేనే అర్ధమౌవుతుంది. చివరికి పట్టాభి ఆధారాలతో సహా బుక్కయ్యాడు. గన్నవరం కోర్టు విధించిన శిక్షతో చేసిన తప్పంతా తమ వైపే ఉందని ఋజువయ్యింది. ఇప్పుడు ఏం మాట్లాడుతావు చంద్రబాబు. మీరే రెచ్చగొట్టి.. మీరే ఆరోపణలు చేస్తే ఎలా బాబు అంటూ పలువురు రాజకీయ నిపుణులు నిలదీస్తున్నారు. అసలు గన్నవరం ఘటనకు కారణం టిడిపి నేతలేనని, పైగా అందులో మహిళల పాత్ర కూడా ఉండటం దురదృష్టరకరం అనే చెప్పాలి. టిడిపిలో సైతం మహిళలు హద్దు అదుపూ లేకుండా ప్రవర్తించడం, చంద్రబాబు వారిని కంట్రోల్ చేయకపోవడమే. చంద్రబాబు ఒక ఫైల్యూర్ సీనియర్ నాయకుడు అని అంటున్నారు.
ఈ వీడీయోలో.. ఈ తెలుగు మహిళా ఎంతటి ఘనకార్యం చేసిందో మీరే చూడండి. ప్రశాంతంగా ఉన్న గన్నవరంలో రెచ్చిపోయి రచ్చ సృష్టించింది ఎవరో ఈ వీడియొ చూస్తూనే.. ఓ క్లారిటీ వస్తుంది. ఓ తెలుగు మహిళ.. మరో మహిళా పోలీసుపై టిడిపి జెండా కర్రతో తలపై ఎలా కొట్టిందో చూడండి. ఇక్కడ ఓ తెలుగు తమ్ముడు సీఐ తలపైకి రాయి విసిరి పోలీస్ అధికారి తలను ఎలా పగలగొట్టాడో చూడండి.
వల్లభనేని వంశీని టార్గెట్ చేసిన పట్టాభి.. రాష్ట్ర టిడిపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి.. సిఎం జగన్ , కొడాలి నాని, వల్లభనేని వంశీని నోటికొచ్చినట్టు తిట్టి.. అక్కడితో ఆగకుండా.. మరుసటి రోజు సాయంత్రం.. విజయవాడ నుంచి కొందరు మనుషుల్ని పంపించి.. గన్నవరంలో అల్లర్లు శ్రుష్టించడానికి పూనుకున్నారు టిడిపి కార్యకర్తలు. అప్పటికే విలేకర్ల సమావేశం నిమిత్తం తమ పార్టీ కార్యాలయానికి వెళ్తున్న వైసీపీ కార్యకర్తలను.. టిడిపి కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను కట్టడి చేశారు. అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతలకై తమ డ్యూటీ తాము చేస్కుంటున్న మహిళా పోలీసుపై టిడిపి జెండా కర్రతో తలపై ఎలా కొట్టిందో చూస్తే.. గన్నవరంలో ఈ రణరంగం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని చాలా క్లియర్ గా అర్ధమవుతుంది.
అంతేకాదు.. ఓ టిడిపి కార్యకర్త విసిరిన రాయి సీఐ తలకు తగలడంతో.. ఆయనకు గాయం అవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడితో ఆగకుండా వైసీపీ కార్యకర్తలపైకి కర్రలతో మీడిమీదికి రావడంతో.. అక్కడ ఉన్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ క్రమంలోనే.. వైసీపీ కార్యకర్తలు టిడిపి కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత మరి కొందర్ని తమ వెంటేసుకొని పట్టాభి గన్నవరం చేరుకునే సమయంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఈ గొడవంతటికీ కారణం పట్టాభే అని అతనిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇప్పుడు చెప్పు చంద్రబాబు.. మీ తెలుగు మహిళా కార్యకర్త మరో మహిళా పోలీసుపై దాడి చేయడం కరెక్ట్ అంటారా..? మీ తెలుగు తమ్ముడు సీఐ తలకు గాయం చేయడం కరెక్ట్ అంటారా..? అన్నీటికీ మించి మీ మాటకు విలువ ఇవ్వకుండా గన్నవారంలో పోటీ చేయాలని ప్రకటించి..రెచ్చిపోయి రచ్చ చేసింది ఎవరో.. ఇపుడు చెప్పండి చంద్రబాబు.