Jagan Team 3.0. ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్.. మంత్రి పదవి నుంచి సీదిరి అప్పలరాజు ఔట్..? తమ్మినేని ఇన్..? అంటూ గత రెండు రోజుల నుంచి రకరకాలుగా ప్రచారం సాగుతోంది. అసలు ఈ వార్తలలో వాస్తవ, అవాస్తమెంత అనేది క్లారిటీ అయితే లేదు. ఇక ప్రచారం అవుతున్న దాని బట్టి చూస్తే.. త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందని.. అందుకు సిఎం జగన్ ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ భేటీలో ముగ్గరు, నలుగురు మంత్రులు ఔట్ అవుతారని, వారిలో కొందరి పేర్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర సీనియర్ నేత.. ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు అప్పగిస్తారని, నిన్నటి వేళ ఆయన సిఎం జగన్ ను తో భేటీ కూడా అందుకు నిదర్శనం అంటూ వార్తలు వస్తున్నాయి. సీదిరికి సిఎంఓ నుంచి పిలుపు వచ్చిందని దీంతో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మంత్రి పదవి నుంచి ఆయనను తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. కొడాలి నానికి మరోసారి చోటు దక్కనుందని కూడా ప్రచారం సాగుతోంది. అదేవిధంగా బాలినేనినికి కూడా చోటు దక్కే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. వీరితో పాటు మరొకర్ని శాసన మండలి నుంచి కేబినెట్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉందని, ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన మర్రి రాజశేఖర్‌ను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని..
ఏప్రిల్-3న ఎమ్మెల్యేలతో జరిగే కీలక సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగనుందని. ఆ తర్వాత ఏప్రిల్ 7వ తేదీ తర్వాత సిఎం జగన్ కొత్త మంత్రుల లిస్ట్ ను విడుదల చేస్తారని అంటున్నారు. అయితే.. ఈ ప్రచారంపై వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కేబినెట్ విస్తరణకు సంభందం ఏంటని వైసీపీ మంత్రులు అంటున్నారు. కేబినెట్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే.. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే.. స్వయంగా సిఎం జగన్ అయినా క్లారిటీ ఇవ్వాలి , లేదంటే ఏప్రిల్ 3 వరకు అయినా వేచి చూడాలి.