1.నేడు ప్రకాశం జిల్లా కారుమంచికి సిఎం జగన్
నేటి సాయంత్రం రాజభవన్లో గవర్నర్ మర్యాదపూర్వక భేటీ.. రేపు విశాఖలో జీ-20 సదస్సుకు హాజరు.
2.సుప్రీంకోర్టులో నేడు వివేకా కేసు పిటిషన్ పై విచారణ..
సీబీఐ తరపున దర్యాప్తు అధికారిని మార్చాలంటూ నిందితుడిగా ఉన్న శివశంకర్రెర్రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్.
3.ఎమ్మెల్సీ ఎన్నికల్లో బేరసారాలు నిజమే!..
టీడీపీ నుంచి 10కోట్లు ఆఫర్ ఇచ్చారన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక.
4.ఆ ఎమ్మెల్యేలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు..
గతంలో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే ఇప్పుడు అమ్ముడుబోయిన వారికీ పడుతుందన్న తానేటి వనిత
5.స్వప్రయోజనాల కోసం దిగజారే బాబు వల్లే శ్రీదేవికి హాని..
మీరు చేసిన తప్పు పనికి, కులానికి సంబంధం ఏంటి? అంటూ ఉండవల్లి శ్రీదేవీపై మండిపడ్డ ఎంపీ నందిగం సురేష్.
6.టాలెంట్ ఉన్న యువతకు, పార్టీ కోసం కష్టపడేవారికే ప్రాధాన్యత..
రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తాని లోకేశ్ హామీ.
7.రాపాక వరప్రసాద్ తాడేపల్లి స్క్రిప్టును చదివారు..
జనసేనలో గెలిచి వైసీపీకి ఎప్పుడో అమ్ముడుపోయాడని బొండా ఉమ విమర్శలు.
8.ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని పక్కా ఆధారాలతోనే ఆ నలుగురిపై సస్పెన్షన్ వేశాం..
చంద్రబాబు క్యారెక్టర్ లేని మనిషి అంటూ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
9.త్వరలో ‘జయహో ఎన్టీఆర్’ వెబ్సైట్
ఎన్టీఆర్ శాసనసభలో చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలతో రెండు పుస్తకాలను తీసుకొస్తున్నామని టీడీ జనార్దన్ వెల్లడి.
10.రేపు హైదరాబాద్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవ్వడమే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం.