చానా కధ నడుపుతున్న వంగవీటి

ఇంకేముంది వంగవీటి రాధా జనసేనలో చేరే సమయం ఆసన్నమయ్యింది.. ఆయన పవన్ కళ్యాణ్ తో భీటీ కూడా షురూ అయ్యింది.. అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. ఆ వార్తలకు బాబు వణికిపోయారో ఏమో పాపం.. పార్టీ మారుతున్నారు అన్న వార్తలకు బ్రేక్ ఇచ్చే ప్లాన్ ఒకటి వేశారు. వంగవీటి రాధా నారా లోకేష్ ని కలవడం. పాదయాత్రలో కలసి అడుగులు వేశారు. దీంతో చాలా విషయాలకు సమాధానం దొరికేసింది. రాధా టీడీపీ నుంచి అసలు వెళ్ళే చాన్సే లేదని ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చర్చలు నడుస్తున్నాయి.

అయితే లోకేష్ ను కలిసిన వేల మరో కొత్త వార్త ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటి అంటే రాధా ఎక్కడ నుంచి పోటీ చేస్తారని చాలా కాలంగా టీడీపీలో ఆ సమస్య ఉంది. రాధాకు అయితే విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని ఉంది. ఆ సీటు కోసమే పట్టుబట్టి మరీ ఆయన వైసీపీ అధినాయకత్వంతో పోరాడి బయటకు వచ్చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తరుణంలో చంద్రబాబు హామీ మేరకు ఆయన టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయనకు బాబు హ్యాండ్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వంగవీటి రాధా తనకు సుపోర్ట్ చేయలేదని అందుకే నేను ఒడిపోయానని బోండా ఉమా కూడా కొన్ని సందర్బాలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇపుడు రాధా కోరుకున్న విజయవాడ సెంట్రల్ టికెట్ ని ఆయనకు కచ్చితంగా ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి స్థాయిలో హామీ లభించింది అని అంటున్నారు.

ఈ మేరకు కొంతకాలంగా సాగిన రాయబేరాలతో ఒక క్లారిటీ వచ్చిందని అంటున్నారు. రాధా ఈ పరిణామంతో ఫుల్ హ్యాపీ అయిన మీదటనే నారా లోకేష్ ని కలిసేందుకు చిత్తూరు జిల్లాకు వెళ్లారని అంటున్నారు. అదే టైం లో విజయవాడ సెంట్రల్ లో ఉన్న సీనియర్ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పరిస్థితి ఏంటి అన్నది చర్చకు వస్తోంది. మరి రాధాకు ఈ సీటు కన్ ఫర్మ్ చేస్తే బోండా ఉమాకు ఏమి అవకాశం ఇస్తారు ఏమి చేస్తారు అన్నదే ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.