రాష్ట్రంలో వంగవీటి రంగా జిల్లాగా సరికొత్త డిమాండ్

1.సీఎం జగన్ నేతృత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెడుతుంది..
దేశంలో అధిక పెట్టుబడులను సాధించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని మంత్రి వేణుగోపలకృష్ణ వెల్లడి.

2.’జగనన్నే మా భవిష్యత్తు’ పేరిట వైసీపీ ఇంటింటి ప్రచార కార్యక్రమం
ఈ నెల 20 నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నట్లు వైసీపీ నేతలు వెల్లడి.

3. సీబీఎన్.. అంటే చంద్ర బూతుల నాయుడు అని పెట్టుకోండి”
సీఎం జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ఫైర్.

4. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన సీఏం జగన్ దంపతులు..
ఏపీ గవర్నర్ గా మూడున్నరేళ్లపాటు సేవలందించినందుకు సీఎం జగన్ కృతజ్ఞతలు.

5.ఏపీలోని జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి..
రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సరికొత్త డిమాండ్

6.ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు..
కేబినెట్ మీటింగ్ లో కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు చర్చించలేదన్న నాదెండ్ల మనోహర్.

7.లోకేశ్ ను పిత్రి, గిత్రి అంటే మామూలుగా ఉండదు..
రోజాకు ఆనం వెంకటరమణారెడ్డి వార్నింగ్.

8.‘బోరుగడ్డ అనిల్.. నీకు సపోర్ట్ చేస్తున్న తాడేపల్లి పెద్దలెవరో చెప్పు’.
తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మాలమహానాడు నేతలు.

9.జనసేన పార్టీలో వర్గ విబేధాలు..
నెల్లూరు అర్బన్ జనసేన నేతను సస్పెండ్ చేసిన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి.

10.సీఎం నివాసానికి సమీపంలో కంటిచూపు లేని బాలిక హత్య షాక్ కు గురిచేసింది..
గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ల స్వైరవిహారం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దుస్థితికి నిదర్శనం అని చంద్రబాబు విమర్శ