వైసీపీలోకి అంబటి రాయుడు లైన్ క్లియర్ చేసిన విజయసాయి

చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి జెండా ఎగురవేసింది. గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది. ధోనీ సేన అయిదోసారి కప్పు కొట్టింది.
అయితే.. ఈ విజయంలో అంబటి రాయుడు, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించారు.స్కోర్ ను గ్రౌండ్ లో పరుగులు పెట్టించారు.
నిమిది బంతులను మాత్రమే ఎదుర్కొన్న అంబటి రాయుడు రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 19 పరుగులు చేశాడు. తక్కువ పరుగులకే అవుట్ అయినప్పటికీ- రన్ రేట్ మాత్రం తగ్గనివ్వలేదు. ఈ మ్యాచ్ లో అంబటి రాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని తమ అభిమానులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన ఈ విజయం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు విజయసాయి రెడ్డి
ట్వీట్ పోస్ట్ చేశారు. చివరి బంతి వరకు ఉత్కంఠతను రేకెత్తించిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా అద్భుతంగా పోరాడాయని అన్నారు. ఈ పోరాటంలో ఎవరో ఒకరే విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి- గుంటూరుకు చెందిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడి పేరును విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంబటి రాయుడికి బెస్ట్ విషెస్ తెలియజేస్తోన్నానని పేర్కొన్నారు. ఐపీఎల్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించి, తన జీవితంలో నెక్స్ట్ ఇన్నింగ్‌ను ఆరంభించనున్న అంబటి రాయుడుకు ఆల్ ది బెస్ట్.. అంటూ ట్వీట్‌ను ముగించారు.

అయితే.. ఆ మధ్య అంబటి రాయుడు సిఎం జగన్ పై ప్రశంసలు కూరపయిపించారు. ఆ తర్వాత ఆయన నేరుగా సిఎం జగన్ ను కలిశారు. ఇక అప్పటి నుంచే అంబటి రాయుడు వైసీపీలో చెరబోతున్నారని వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌
తో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. వైఎస్ఆర్సీపీలో చేరికకు విజయసాయి రెడ్డి లైన్ క్లియర్ చేశారనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమౌతోన్నాయి మరి చూడాలి అంబటి రాయుడు పార్టీలో చెరతారా లేదా అనేది.