లేరనుకున్నారా..? రారనుకున్నారా..? ప్రస్తుతం ఈ డైలాగ్ విజయసాయిరెడ్డికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకో తెలుసుకోవాలని ఉందా..ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే. వైసీపీలో విజయసాయిరెడ్డి నంబర్ టూ అనే చెప్పాలి. ఎందుకంటే వైఎస్ జగన్ విజయసాయిరెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత అని చెప్పాలి. చాలాకాలం పాటు వైసీపీలో చక్రం తిప్పారు. కేవలం రాజ్యసభ సభ్యుడిగానే కాకుండా వైసీపీ అనుబంధ విభాగాల ఇంచార్జిగా ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ గా జగన్ తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చారు. నిత్యం ట్విటర్ లో చంద్రబాబు,
లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు చేసేవారు. ఆ తర్వాత ఆయన పెద్దగా ట్వీట్లు చేయలేదు. చాలా సైలెంట్ గా వ్యవహరించారు. ఆయనను ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ గా కూడా తప్పించడంతో ఇక సోషల్ మీడియాలో కథనాలు తెగ హల్ చల్ చేశాయి. విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యత లేదని.. ఆయనను సిఎం జగన వాడుకొని వదిలేశారని.. ఇలా ఎన్నో రకాల ఊహాగానాలకు తావిచ్చాయి. దీనికి తోడు.. ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశాక అతడు బెంగళూరులో చికిత్స పొందుతున్నప్పటి నుంచి మరణించాక అంత్యక్రియల వరకు విజయసాయిరెడ్డి దాదాపు అన్నీ చూసుకున్నారు. నందమూరి బాలకృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబులతో అన్ని కార్యక్రమాలను సమన్వయం చేశారు.దీంతో విజయసాయిరెడ్డిపైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని.. చంద్రబాబు బాలకృష్ణల పక్కనే కూర్చోవడం వాళ్లతో రాసుకుపూసుకు తిరగడం ఏంటని మందలించారని గాసిప్స్ వినిపించాయి. అంతేకాకుండా ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. దీంతో ఇక వైసీపీలో విజయసాయిరెడ్డి శకం ముగిసినట్టేనని దాదాపు అంతా భావించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. తాజాగా చంద్రబాబు ప్రకటించిన టిడిపి మేనిఫెస్టోపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోనే వెబ్ సైట్ నుంచి మాయం చేసిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయమంటారేమోనని మేనిఫెస్టోనే మాయం చేసిన వారు ఇప్పుడు ఆల్ ఫ్రీ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఈ మాయ మేనిఫెస్టోలో ఎవరు పడతారని విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో ప్రశ్నించారు. ఎట్టకేలకు చాలా కాలం తర్వాత ప్రత్యర్థి పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ ఆయన ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.