జగనన్న కార్యక్రమానికి జననీరాజనాలు పార్టీ పెట్టి పవన్ ఏం చేస్తున్నాడు 6 నెలలు మంత్రి పోస్ట్ కావాలన్న రఘురాజు

1.‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన..
ప్రజలు తమకు అనువణువునా నీరాజన౦ పడుతున్నారని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్య.

2.నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేయడం తప్పే..
తన మాట వినకుండా చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి ద్రోహం చేశారని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపణ.

3.పార్టీ పెట్టి పవన్ ఏం చేస్తున్నాడు..
రాజకీయంగా పవన్ కల్యాణ్ పై ప్రజల్లో నమ్మకం లేదని మంత్రి రోజా ఎద్దేవా .

4.వైసీపీ హయాంలో రాష్ట్ర౦లో దాదాపు 87శాతం మందికి సంక్షేమ పథకాలు అందించా౦..
ప్రజలంతా మళ్లీ జగనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్న బాలినేని శ్రీనివాసరెడ్డి.

5.బీజేపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..
కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోనే ఒక్కో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం కోల్పోతూ వచ్చిందని వ్యాఖ్య.

6.ఏపీ సీఎస్‌కు జేఏసీ మలిదశ ఉద్యమ కార్యాచరణ నోటీసు
సకాలంలో జీతాలు అందక ఉద్యోగుల కుటుంబాల్లో ఆందోళన నెలకొందని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడి

7.”గంజాయి వద్దు బ్రో” అంటూ వినూత్న ప్రచారాన్ని ప్రారంభి౦చిన చంద్రబాబు..
డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టే వరకు పోరు ఆగదని వెల్లడి

8.’ది ప్రింట్’ లో వచ్చిన కథనంపై జగన్ ఏం చెపుతారు?..
జగన్ దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎలా అయ్యాడ౦టూ బొండా ఉమ ప్రశ్న.

9.నాకు 6 నెలలు హోం మంత్రి పోస్ట్ ఇవ్వండి.. నేనేంటో చూపిస్తా..
గంజాయ్ సరఫరాను నియంత్రించలేని వారికి పదవి అవసరమా అని ప్రశ్నించిన రఘురాజు

10.నెల్లూరులో టిడ్కో ఇళ్ల వద్ద నిల్చుని సీఎం జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరిన చంద్రబాబు
నువ్వు కట్టిన ఇళ్లు ఎక్కడ? అంటూ సీఎం జగన్ కు సవాల్