వీకెండ్ పొలిటీషన్ ఎక్కడ..బాబుకు హ్యాండ్ ఇచ్చిన పవన్

గన్నవరం ఘటనతో రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పట్టాభి అరెస్ట్ తో గన్నవరంలో రాజకీయ హీటు రాజుకుంది. వైసీపీ కార్యకర్తలే తమ కార్యాలయంపై దాడి చేశారని, అన్యాయంగా టిడిపి పై నిందలు వేస్తూ, రౌడీల్లా వ్యవహరిస్తున్నారని.. చంద్రబాబు తెగ ఫీల్ అయిపోయారు. చివరికి చేసిన తప్పుకి పట్టాభి జైలు పాలయ్యారు. తమ తప్పేమీ లేనట్టు చద్రబాబు అనవసరంగా పోలీసులపై నోరుపారేసుకున్నారు. మీ పార్టీ తెలుగు మహిళలు చేసిన నిర్వాకం చూస్తే మీరు ఇలా మాట్లాడి ఉండరేమో బహుశా. ఓ మహిళ పోలీసుపై టిడిపి జెండా కర్రతో తలపై కొట్టి రెచ్చగొట్టింది చూస్తే.. మీరే తలదించుకునేవారు. ఇక అసలు విషయంలోకి వేలితే.. గతంలో రెండుసార్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అదీ కూడా.. వారిపై ప్రభుత్వం కక్ష్య సాదింపు చర్యలు చేపడుతున్నారని, తమకు రక్షణ లేదని, తమను రాష్ట్రంలో తిరగనీయకుండా చేస్తున్నారని.. వీరిద్దరూ భేటీ అయ్యి ఒకరికొకరు సంఘీభావం ప్రకటించుకున్నారు. చంద్రబాబుకు ఎప్పుడు ఏం జరిగినా పవన్ కళ్యాణ్ అలా వాలిపోతారు. తాజాగా చంద్రబాబు సభకు ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని కూడా పవన్ ట్వీట్ చేశారు. కానీ వీరు భేటీ అవలేదు. అయితే.. పవన్ కళ్యాణ్ కి సిఎం కేసీఆర్ వెయ్యి కోట్లు ఆఫర్ అంటూ తాజాగా ఓ వార్తా పత్రికలో ఓ కధనం వెలువడింది. దీనిపై పవన్ ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. పవన్ కళ్యాణ్ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటారని కూడా ఈ కధానంలో చెప్పుకొచ్చారు. అయితే.. టిడిపికి ఇంత జరుగుతున్నా మరి పవన్ కళ్యాణ్ ఈసారెందుకో సంఘీభావం ప్రకటించాడానికి రాలేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గన్నవరం ఘటనపై స్పందించకవడానికి కారణం ఆ కధనంలో వచ్చినవి వాస్తవాలే అయి ఉంటాయి.. అందుకే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.