ఉండవల్లి ఆచూకీ..? షాక్ ఇచ్చిన వైసీపీ కార్యకర్తలు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి రసవత్తరంగా ముగిశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను క్రాస్ వోటింగ్ కి పాల్పడలేదని ఎన్నికల ఫలితాల రోజున మీడియా ముందు చెప్పుకొచ్చిన ఉండవల్లి శ్రీదేవి. ఆ మరుసటి రోజు నుంచి ఆచూకీ లేకుండా పోయారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కూడా వస్తుందని.. వరఆర్తలు వస్తున్నాయి. ఇక నిన్నటి వేళ ఆమె కార్యాలయంపై దాడి జరిగినప్పటికీ.. ఇప్పటికీ ఉండవల్లి శ్రీదేవి స్పందించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆమె ఎలాంటి తప్పు చేయకపోతే.. మీడియాకు కూడా ఎందుకు అందుబాటులో లేకుండా పోయారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆమె స్పందించని నేపధ్యంలో ఆమె నిజంగానే క్రాస్ ఓటింగ్ కి పాల్పడి ఉంటుందని ఆ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు.. తాడికొండ నియోజకవర్గంలో ఆమె కార్యాలయంపై దాడి చేసి, ఫ్లెక్సీలు చించివేసి నిరసన వ్యక్తం చేశారు. మరో వైపు ఆమెను పార్టీ నుండి సస్పెండ్ అవడంతో మరికొందరు వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తారుణంలోనే రాజకీయంగా ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి..? ఆమె టిడిపి లోకి జంప్ అవుతారా..? లేక వేరే ఇంకేదైనా పార్టీ చూసుకుంటారా..? అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్నలు మొదలయ్యాయి. ఇక ఈ క్రమంలోనే ఆమెతో టిడిపి నేతలు టచ్ లో ఉన్నట్లు కూడా తెగ ప్రచారం జరుగుతోంది. నెక్స్ట్ ఆమె టిడిపి తీర్ధం పుచ్చుకుంటారని కూడా అంటున్నారు. మరి ఇన్ని ప్రశ్నలకు జవాబు దొరకాలంటే ముందుగా ఉండవల్లి శ్రీదేవి అజ్ఞాతాన్ని వీడి.. ఏదో ఒకటి వివరణ ఇస్తే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు.