వై నాట్.. అంటోన్న జేడీ సీఎం జగన్ అలా చేస్తే సూపర్

ఏపీ రాజకీయాలు ఎన్నికల వేడిని తలపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఎవరికి వారు తమ రాజకీయ పార్టీలను బలోపేతం చేయడానికి రహస్యంగా పావులు కదుపుతున్నారు. ఇక ఈ క్రమంలోనే మోదీపై తిరుగుబాటు చేస్తున్న కేఎసీఆర్ తమ బీఆర్ఎస్ పార్టీని ఏపీలో బలోపేతం చేయడానికి పావులు కదుపుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసిన తరువాత- ఇక్కడి పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. విశాఖపట్నం కేంద్రబిందువుగా బీఆర్ఎస్ ఏపీలో తన కార్యకలాపాలను చేపట్టింది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించడంపై లక్ష్మీనారాయణ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియలో పాల్గొనాలని నిర్ణయించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ సెయిల్ కూడా ఇదే విధంగా ఆసక్తి చూపుతాయని భావిస్తున్నానన్నారు. ఈ మేరకు లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను తెలంగాణ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఏపీ సీఎం జగన్ సెయిల్ లకు ట్యాగ్ చేశారు. సిఎం జగన్ కూడా ఎందుకు అలా చేయకూడదని అన్నారు. మరి సిఎం జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.