దొంగ ఓట్లతోనే గెలిచా.. బాం* పేల్చిన రెబల్ ఎమ్మెల్యే

ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే.. రాజకీయ నాయకులపై ప్రజలకు నమ్మకం పోతుందా..? విలువలతో కూడిన రాజకీయాలు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయా..? అంటే.. కొందరు రాజకీయ నాయకులు చేసే రాజకీయాలను బట్టి చూస్తే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటు పుట్టించాయి. ఇవి మరువకమునుపే.. మరో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయనే.. జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే. జనసేన తరఫున తాను ఒకే ఒక్కడుగా ఉంటానని.. ప్రజా సమస్యల పోరాటం కోసం పనిచేస్తానని అప్పట్లో రాపాక భారీ డైలాగులు కొట్టారు. ప్రస్తుతం ఆయన వైసీపీకి మద్దతు ప్రకటిస్తూ.. సిఎం జగన్ వెంట నాడుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తనకు టిడిపి పది కోట్ల ఆఫర్ ప్రకటించిందని.. అయినప్పటికీ ఆ ఆఫర్ ను తాను స్వీకరించలేదని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా రాపాక వరప్రసాద్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఓ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో తాను సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని రాపాక బాంబుపేల్చారు. చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్ బూత్ లో తనకు దొంగ ఓట్లు పడేవని తెలిపారు. తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేసేసేవారన్నారు. దీంతో తనకు చింతలమోరి గ్రామంలో ఏడు నుంచి ఎనిమిది వందల వరకు మెజారిటీ వచ్చిందంటూ.. అదేదో ఘనకార్యమన్నట్టు రాపాక వ్యాఖ్యలు చేశారు. అదీ కూడా నవ్వుతూ చెప్పుకురావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించేలా మాట్లాడారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను సోషల్ మీడియాలో నెటిజన్లు వ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు.