యాత్ర అట్టర్ ఫ్లాఫ్..రెచ్చిపోతున్న లోకేష్, ప్రజల ప్రాణాలతో చెలగాటం

చంద్రబాబు, లోకేష్ ల యాత్రల వల్ల ఇప్పటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి అత్యుత్సాహం, పబ్లిసిటీ పిచ్చితో, రాజకీయ లబ్ధికోసం.. రూల్స్ ని అతిక్రమించి.. రోడ్ షోలు చేస్తూ అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే ఏ ఒక్కరి ప్రాణాలకు ముప్పు రాకూడదని జగన్ సర్కార్ కొన్ని నిబంధనలు తీసుకొస్తే వాటిని కాదని.. తమ ఇష్టానుసారంగా పాదయాత్ర చేస్తున్నారు లోకేష్. ఇరుకు సందుల్లో ప్రసంగాలు వద్దు అని కండీషన్ పెట్టినా.. చివరికి లోకేష్ అదే చేస్తున్నారు. దానిని అడ్డుకోవాలని ప్రయత్నించిన పోలీసులపై రౌడీ యిజానికి పాల్పడుతున్నారు. ప్రసంగాలు ఎక్కడ పెట్టుకోవాలో తామే ఏర్పాటు చేస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ.. లోకేష్ ఏ మాత్రం వినకుండా.. మళ్ళీ మళ్ళీ ఇరుకు సందులలోనే ప్రసంగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిన్నటి వేళ విధులలో ఉన్న ఓ కానిస్టేబుల్ మృతి చెందినా జాలి అన్నది కూడా లేకుండా లోకేష్ తమ రాజకీయ లబ్దికోసం తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు.

తన పాదయాత్రకు జనం రాకపోవడంతో.. ఆవేశానికి లోనై పోలీసులపై వాగ్వాదానికి దిగుతున్నారు. పోలీసులు ఎంత చెప్పినా ఏ మాత్రం వినకుండా రోడ్డుపై స్టూల్ ఎక్కి మరీ .. ఏం చేసుకుంటారో చేస్కోండి అంటూ.. పోలీసులపై నిప్పులు చెరుగుతున్నారు. తమ కార్యకర్తలను రోడ్డుకు అడ్డంగా కూర్చోమని ఆదేశాలు ఇస్తున్నారు. అదేమంటే.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన పోలీసులకు పోస్టింగులు అంటూ సమాధానం ఇస్తున్నారు. ఒకానొక సమయంలో టిడిపి కార్యకర్తలు పోలీసులపై దాడి చేసేందుకు కూడా యత్నించారు. తమకు చట్టం తెలుసంటూ.. బుక్ తిరగేస్తూ రూల్స్ వినిపిస్తున్నారు. మేము చెప్పేది మీ మంచికి, ప్రజల కోసం అని పోలీసులు ఎంత వేడుకున్నా లోకేష్ గానీ, టిడిపి నాయకులు గానీ వినే పరిస్థితిలో లేరు. ఈ క్రమంలోనే గంగాధర నెల్లూరు మండలంలో పాదయాత్రలో పాల్గొన్న ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనకు కారణం తోపులాటేనని పోలీసులు వివరించారు. ఇలా లోకేష్, చంద్రబాబు కలిసి తమ రాజకీయ లబ్ధి కోసం ఇంకెంతమంది అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకుంటారో అంటూ రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.