నిజం ఒప్పేసుకున్న మేకపాటి ఛీ కొడుతున్న కార్యకర్తలు..!

ఎమ్మెల్సీ ఎన్నికల హీటు ఏపీ రాజకీయాలను ఓ ఊపు ఉపేసింది. వైసీపీలో ఉంటూ.. టిడిపి అభ్యర్ధికి ఓటు వేసిన ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇన్ని రోజులు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ జరిగిన తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేరుగా బెంగళూరు వెళ్లిపోయారు. ఉండవల్లి శ్రీదేవి కూడా హైదరాబాద్ లోనే మకాం వేశారు. ఇక ఎట్టకేలకే.. సస్పెన్షన్‌కు గురైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బెంగళూరు నుంచి ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చారు. వచ్చి రాగానే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ నాకు టికెట్ ఇవ్వనని తేల్చి చెప్పారని.. తనకు జగన్ టిక్కెట్ ఇవ్వలేనని ముందే చెప్పడంతో బాధపడ్డానని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిజం ఒప్పుకున్నారు. తన కుమార్తెకు అవకాశం కల్పించాలని తాను కోరినా జగన్ ఒప్పుకోకపోవడంతో బాధపడి బయటకు వచ్చానని తెలిపారు. అయితే తాను మాత్రం క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని తెలిపారు. తాను పార్టీ నుంచి బయటకు వెళ్లలేదని, వాళ్లే పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక సాకు చెప్పి తనను సస్పెండ్ చేశారని తెలిపారు. తాను జనంలోనే ఉంటానని, జనం.. తనతోనే ఉంటారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో తమ కుటుంబానికి పేరుందని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి సపోర్టు చేసే వాళ్లంతా వెధవలకే నంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై సజ్జల తప్పుడు కేసులు పెట్టించబోయారని సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ కోసం ప్రాణం పెట్టా.. కానీ పార్టీ నాకు ద్రోహం చేసిందని అన్నారు. జగన్ నాకు మాట ఇచ్చి తప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. తనను ఏ టీడీపీ నేతలు పిలవలేదని, తాను స్వతంత్ర ఎమ్మెల్యేగానే కొనసాగుతానని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇక ఈ వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. నిజంగా పార్టీపై అంత అభిమానమే ఉంటే.. చేసిన తప్పును ఒప్పుకోవాలని అంటున్నారు. పార్టీకి, నిన్ను నమ్మి గెలిపించిన ప్రజలకి నమ్మకద్రోహం చేశావంటూ వైసీపీ కార్యకర్తలు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యకార్యకర్తలతో భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నది చూడాలి.