2024లో అధికారం వైసీపీదే తేల్చి చెప్పేసిన పబ్లిక్ పల్స్

వచ్చే ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ సిఎం జగన్ ఖాతాలో భారీ విజయం వచ్చి చేరింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 9 స్థానాలకు గానూ.. 5 స్థానాలు ఏకగ్రీవం అవ్వగా.. మిగతా స్థానాలకు నేడు జరిగిన కౌంటింగ్ లో వైసీపీ మొత్తం స్థానాలను గెలుచుకుంది. దీంతో, ఎన్నికలు జరిగిన తొమ్మది ఎమ్మెల్సీ సీట్లు వైసీపీ ఖాతాలో చేరాయి. ఇక 3 గ్రాడ్యుయేట్.. 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ 5 స్థానాలు కూడా వైసీపీనే విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీస్ అని చెప్పొచ్చు. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో గెలుపు పైన అధికార వైసీపీ..ప్రతిపక్ష టీడీపీ ధీమాగా కనిపిస్తున్నాయి. ఫైనల్స్ సమరానికి ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు సెమీస్ గా భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ సింగిల్ గా పోటీ చేసింది. టీడీపీ పట్టభద్రుల నియోజకవర్గంలో లెఫ్ట్ పార్టీలతో పరస్పర అవగాహన కుదుర్చుకుంది. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా..జనసేన తీరు చర్చకు దారి తీసింది. వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపునిచ్చిన జనసేన ఎవరికి ఓటు వేయాలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు పైన హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఓట్ల లెక్కింపుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఫలితం ప్రకటన మాత్రం కోర్టు సూచనలకు లోబడి ఉండాలని సూచించింది.