మేకపాటిని తరిమి కొడుతాం ఉదయగిరిలో వైసీపీ కార్యకర్తల సంబరాలు

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వైసీపీ కార్యకర్తల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ఆయన ఉదయగిరికి వస్తే తరిమి తరిమి కొడుతాం.. అంటూ చేజార్ల సుబ్బారెడ్డి మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో నిన్ను చూసి ఎవ్వరూ ఓటేయలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మొహం చూసి, జగన్ కష్టం చూసి ప్రజలు నీకు ఓటేసి నిన్ని గెలిపించారని వైసీపీ నేత చేజార్ల సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు నువ్వు నోట్లకు అమ్ముడు పోయి.. నీ గెలుపు కోసం కష్టపడ్డ మమ్మల్ని మోసం చేశావని వైసీపీ కార్యకర్తలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. వైసీపీ నిన్ను సస్పెండ్ చేసినందుకు నేడు మేమందరం సంబరాలు చేసుకుంటున్నామని కూడా చేజార్ల సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు మగాడివైతే ఉదయగిరి నియోజకవర్గంలో ఇండిపెండెండ్ గా పోటీ చేస్తావా, లేక వేరే పార్టీ నుండి పోటీ చేస్తావా..? నిన్ను మట్టికరిపించడం ఖాయమని చేజార్ల సుబ్బారెడ్డి
ఛాలెంజ్ చేశారు. నీలాంటి దుర్మార్గుడు, నమ్మకద్రోహి రాజకీయాలకు పనికిరాడని చేజార్ల సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు.