చరిత్ర తిరగరాసిన వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలో భారీ విజయం ట్రెండింగ్ లో వైసీపీ.. మట్టికరిచిన టీడీపీ

ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా ఒకటే మాట అదే జగన్ పేరే.. ఇంటింటికీ జగన్ జెండా రెపరేపలాడుతోంది. అభిమానులు అయితే.. ఏకంగా సిఎం జగన్ స్టిక్కర్ ను దేవుడి పూజ గదిలో పెట్టుకుంటున్నారు. జనం అంటే జగన్.. జగన్ అంటే జనం అన్న విధంగా రాష్ట్రంలో 80శాతం ప్రజలందరూ జగన వైపే ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఏకంగా 151 సీట్లు కైవసం చేసుకొని.. ప్రతిపక్షాలను కొల్లగొట్టి.. చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టించి.. రాజన్న పాలననుప్రజలు కోరి తెచ్చుకొని సరిగ్గా నేటికీ 4 ఏళ్లు. 4 ఏళ్ల క్రిందట అంటే మే 23 , 2019న వచ్చిన ఎన్నికల ఫలితాలలో ఫ్యాన్ గాలిలో టీడీపీ కొట్టుకుపోయి.. వైసీపీకి ప్రజలు పట్టం కట్టిన రోజు ఇది. ఫ్యాన్ . గిరాగిరా తిరిగిన రోజు. 50 శాతానికి పైగా ఓట్లు.. 151 అసెంబ్లీ సీట్లు.. 22 లోక్‌సభ స్థానాల్లో YCP అఖండ విజయం దక్కించుకొని టిడిపికి ఊపిరి ఆడకుండా చేసిన రోజు. 23 వ తేదీన కేవలం 23 సీట్లలోనే టీడీపీ గెలుపు సాధించి మట్టికరిచిన రోజు. సిఎం జగన అధికారంలోకి రావడానికి ఆయన పడ్డ కష్టం వర్ణనాతీతం. జగన్.. సి‌ఎం గా ప్రమాణస్వీకారం చేయడం వెనుక ఆయన పాన్ని౦డు ఏళ్ల రాజకీయం, చేసిన కృషి , ఎంతగానే ఉంది. అన్నీటికీ మించి వైఎస్ రాజశేఖర రెడ్డి.. పేద ప్రజలకు అందించిన స్వచ్చమైన పాలన మరోసారి ప్రజలకు చేరువ చేయాలన్న కుమారుడిగా తపన ఉంది. అవే ఆశయాలు, అవే ఆదర్శాలు, అవే ఆలోచనలు, అదే ఆచరణ, అదే విశ్వసనీయత.. తండ్రి ఆశయాలను ఓ ఆయుదంలా మలచుకుని, తండ్రి ఆశయ సాదన కోసం.. ఎన్నో కష్టాలను ఎదురోడ్డి.. తడబడకుండా నిలబడి.. భారీ మెజారిటీతో అధికారాన్ని చేపట్టి నేడు.. రాష్ట్రంలో రాజన్న పాలనను, కాదు.. కాదు.. అంతకు మించి.. నేరుగా ప్రజల వద్దకే పాలనను అందిస్తున్నారు.. సిఎం జగన్.

జగన్ సి‌ఎం అయిన నాటి నుండి..నేటి వరకు ప్రజలకు సమన్యాయ పాలన అందిస్తూ వస్తున్నారు. అవ్వ- తాతలకి పెన్షన్, పేదలకు సొంత ఇళ్ళు, విద్యా దీవెన, జగనన్న చేయూత, విదేశీ విద్య, ఆరోగ్యశ్రీ,ఇలా ఒకటి కాదు ఆరు కాదు.. నవరత్నాల పేరుతో సి‌ఎం జగన్ ప్రజల దృష్టిలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. సంక్షేమ పథకాల అమలులో చుట్టుపక్కల రాష్ట్రాలతో పోలిస్తే… సి‌ఎం జగనే టాప్ పొజిషన్ లో ఉన్నట్టు ఓ సర్వేలో కూడా వెల్లడయ్యింది. సంక్షేమంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్ర అభివృద్దికి సిఎం జగన్ ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. తాజాగా విశాఖలో జరిగిన జీ-ట్వంటీ సదస్సులో ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక దిగ్గజాలు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. సచివాలయాలు, వాలంటర్లు, ఔట్ సోర్సింగ్ లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ యువతకు సిఎం జగన్ బంగారు భావిష్యత్ ను కల్పించారు. ఇంత చేస్తున్న జగన్ కు.. ప్రజలు మళ్ళీ పట్టం కట్టనున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు జగన్ జనరంజక పాలన సూపర్ అంటూ రాష్ట్ర ప్రజలు తమ అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ ను వైసీపీ సోషల్ మీడియా కుదిపేస్తోంది. YSRCPAgain2024 #ట్యాగ్ తో ట్విటర్లో ట్రెండింగ్ అవుతోంది. #ట్యాగ్ ప్రారంభమైన ఒక్క గంటకే జాతీయ స్థాయిలో ఉండటంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. తమ నాలుగేళ్ల పాలనలో సిఎం జగన్ సాధించిన విజయాలు, ఆయన రాజకీయ ప్రస్తావనలతో ట్వీట్ లు చేస్తున్నారు.